త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priya Bhavani Shankar | ఇరుముడి స‌క్సెస్ మీట్‌లో కింద‌ప‌డిపోయిన‌ హీరోయిన్ – వీడియో వైర‌ల్‌

గురువారం జ‌రిగిన ఇరుముడి స‌క్సెస్ మీట్‌లో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ వేడుక‌లో హీరోయిన్ ప్రియా భ‌వానీ శంక‌ర్ కింద‌ప‌డిపోయింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. తృటిలో ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో మూవీ టీమ్ ఊపిరి పీల్చుకున్నారు.

N

Entertainment | Published On Sep 11, 2026, 1.54 pm IST

Priya Bhavani Shankar | ఇరుముడి స‌క్సెస్ మీట్‌లో  కింద‌ప‌డిపోయిన‌ హీరోయిన్ – వీడియో వైర‌ల్‌
Advertisement

Priya Bhavani Shankar |  ర‌వితేజ హీరోగా న‌టించిన ఇరుముడి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తొంది. కేవ‌లం న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 250 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రిలీజై ఇర‌వై రోజులు దాటినా క‌లెక్ష‌న్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ర‌వితేజ కెరీర్‌లోనే రెండు వంద‌ల కోట్ల మార్క్‌ను ట‌చ్ చేసిన ఫ‌స్ట్ మూవీగా ఇరుముడి నిలిచింది.

రెమ్యూన‌రేష‌న్‌...

రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో ఇరుముడి సినిమాలో న‌టించాడు ర‌వితేజ‌. అత‌డికి ఈ సినిమా ద్వారా 75 కోట్లకుపైనే వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. ఇరుముడి స‌క్సెస్‌తో ఆనందంలో ఉన్నద‌ర్శ‌క‌నిర్మాత‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ పేరుతో గురువారం ఓ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో హీరోహీరోయిన్లు ర‌వితేజ‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

స‌క్సెస్ మీట్‌

స‌క్సెస్ మీట్‌లో ర‌వితేజ‌ యూనిట్ స‌భ్యుల‌కు షీల్డ్‌ల‌ను అంద‌జేశారు. వాటిని స్వీక‌రించ‌డానికి స్టేజ్‌పైకి వెళుతున్న క్ర‌మంలో హీరోయిన్ ప్రియా భ‌వానీ శంక‌ర్ కింద‌ప‌డిపోయింది. వేడుక‌లో ఉన్న అంద‌రూ కంగారుప‌డ్డారు.

వీడియో వైర‌ల్‌....

గాయాలు లేకుండా ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ త‌ర్వాత స్టేజ్‌పైకి వెళ్లిన ప్రియా భ‌వానీ శంక‌ర్‌కు ర‌వితేజ షీల్డ్ అందించారు.

నాచుర‌ల్ యాక్టింగ్‌...

ఇరుముడి మూవీలో ప్రియా భ‌వానీ శంక‌ర్ త‌ల్లి పాత్ర‌లో క‌నిపించింది. డీ గ్లామ‌ర్ రోల్‌లో స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. ఈ సినిమాతో తెలుగులో ఫ‌స్ట్ హిట్‌ను అందుకుంది. తండ్రీకూతుళ్ల అనుబంధానికి థ్రిల్ల‌ర్ ఎలిమెంట్‌ను జోడించి డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెర‌కెక్కించారు. సాయికుమార్‌, బేబీ న‌క్ష‌త్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

;

Advertisement
Advertisement