త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | పాపం పండి ఫాంహౌస్‌కు ప‌రిమిత‌మైన కేసీఆర్‌: పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌

Mahesh Goud | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పాపం పండి ఫాంహౌస్‌కు ప‌రిమిత‌మ‌య్యార‌ని పీసీసీ అధ్య‌క్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకుందని ఆరోపించారు.

G

Telangana | Published On Sep 11, 2026, 1.05 pm IST

Mahesh Goud | పాపం పండి ఫాంహౌస్‌కు ప‌రిమిత‌మైన కేసీఆర్‌: పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌
Advertisement

Mahesh Goud | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పాపం పండి ఫాంహౌస్‌కు ప‌రిమిత‌మ‌య్యార‌ని పీసీసీ అధ్య‌క్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకుందని ఆరోపించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ (BRS) హయంలో అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు ఎగతాళి చేసి ఇండ్లు నిర్మించలేని దుస్థితి ఏర్ప‌డింద‌ని విమ‌ర్శించారు. శాస‌న మండ‌లిలో ఇందిర‌మ్మ ఇండ్ల‌పై (Indiramma Indlu) మ‌హేశ్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇండ్లు గొప్ప కార్యక్రమని చెప్పారు.

రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇండ్లు నిర్మించడం శుభపరిణామమ‌ని తెలిపారు. దేశంలో పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీ (Congress) సాకారం చేసిందని వెల్ల‌డించారు. నిజామాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.720 కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. పేదవాడి కలను సాకారం చేయాల‌ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకుంద‌ని, పాపం పండి కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పరిమిత‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు.

Advertisement
Advertisement