Old Delhi | పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత.. మున్సిపల్ సిబ్బంది, పోలీసులపై జనం రాళ్ల దాడి
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) పాతబస్తీ (Old Delhi) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పాతబస్తీలోని తుర్క్‌మన్ గేట్ సమీపంలో పురాతన ఫైజ్-ఎ-ఇలాహీ మసీదును ఆనుకుని ఉన్న ఆక్రమణలను (Encroachments) బుధవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) పాతబస్తీ (Old Delhi) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పాతబస్తీలోని తుర్క్‌మన్ గేట్ సమీపంలో పురాతన ఫైజ్-ఎ-ఇలాహీ మసీదును ఆనుకుని ఉన్న ఆక్రమణలను (Encroachments) బుధవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అర్దరాత్రి 1.30 గంటలకు చేపట్టిన ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వడంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అప్పటికీ అదుపులోకిరాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. తుర్క్‌మన్ గేట్ పరిసరాల్లో దాదాపు 10 కంపెనీల ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను ఇక్కడ మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చివేతలు చేపట్టామని మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ (MCD) అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. అంతకుముందు ఈ కూల్చివేతలను సవాలు చేస్తూ మసీదు సయ్యద్ ఇలాహి నిర్వాహక కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ, గతంలోనే కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అధికారులు ఈ తొలగింపు చేపట్టారు.
#WATCH | Delhi | Visuals from the area near Faiz-e-Elahi Masjid, Turkman Gate, where MCD, pursuant to the directions of the Delhi High Court, carried out a demolition drive on an encroachment earlier today.
Madhur Verma, Joint Commissioner of Police, Central Range, says, "During… pic.twitter.com/OtauQ2Acgh
— ANI (@ANI) January 7, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Excise Scam Case | కోర్టు ధిక్కరణ కేసు.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు తాఖీదులు..
మే 19, 2026

Vinesh Phogat | వినేశ్ ఫొగాట్ పిటిషన్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
మే 18, 2026

Sunjay Kapur Property Dispute | కరిష్మా కపూర్ పిల్లలకు భారీ ఊరట.. రూ.30 వేల కోట్ల సంజయ్ కపూర్ ఆస్తులను ఫ్రీజ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



