త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JEE Main | జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు వాయిదా.. విడుద‌ల ఎప్పుడంటే?

JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) 2026 సెష‌న్ 1 ఫ‌లితాల విడుద‌ల వాయిదా ప‌డింది. షెడ్యూల్ ప్ర‌కారం ఫ‌లితాలు గురువారం (ఫిబ్ర‌వ‌రి 12న‌) విడుద‌ల అవ్వాల్సి ఉంది. అయితే తుది ఆన్స‌ర్ కీతోపాటు ఫ‌లితాల‌ను ఫిబ్ర‌వ‌రి 16న ప్ర‌క‌టిస్తామ‌ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా వెళ్ల‌డించింది.

G

National | Published On Feb 12, 2026, 11.28 am IST

JEE Main | జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు వాయిదా.. విడుద‌ల ఎప్పుడంటే?
Advertisement

JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) 2026 సెష‌న్ 1 ఫ‌లితాల విడుద‌ల వాయిదా ప‌డింది. షెడ్యూల్ ప్ర‌కారం ఫ‌లితాలు గురువారం (ఫిబ్ర‌వ‌రి 12న‌) విడుద‌ల అవ్వాల్సి ఉంది. అయితే తుది ఆన్స‌ర్ కీతోపాటు ఫ‌లితాల‌ను ఫిబ్ర‌వ‌రి 16న ప్ర‌క‌టిస్తామ‌ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా వెళ్ల‌డించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న విద్యార్థుల‌కు నిరాశ‌ ఎదుర‌యింది. అయితే అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎన్‌టీఏ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

జేఈఈ మెయిన్ సెష‌న్-1 ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు దేశ‌వ్యాప్తంగా 13 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ప్రాథ‌మిక కీని ఫిబ్ర‌వ‌రి 4న ఎన్‌టీఏ విడుద‌ల చేసింది. స‌వ‌రించిన షెడ్యూల్ ప్ర‌కారం ఫ‌లితాల‌ను ఫిబ్ర‌వ‌రి 16న ఏ క్ష‌ణ‌మైన ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో కాని, తెల్ల‌వారుజామున కానీ ఫ‌లితాల‌ను అందుబాటులో ఉంచుతారు. సెషన్-1 ఫలితాల వెల్లడి తర్వాతే జేఈఈ సెషన్-2 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఫలితాలను ఎలా చూసుకోవాంటే..

విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను (Score Card) అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా హోమ్ పేజీలో కనిపించే ‘JEE Main 2026 Session 1 Scorecard’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత రిజ‌ల్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

https://x.com/NTA_Exams/status/2021630712533987460

Advertisement
Advertisement