PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..
PhonePe | డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే తన వినియోగదారులకు షాకిచ్చింది. ఫోన్‌పేలో ఉన్న వాలెట్ సదుపాయాన్ని 365 రోజులకు పైగా ఉపయోగించకపోతే రూ.100 ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఫోన్‌పే తన వాలెట్ సేవలకు సంబంధించిన నిబంధనలను తాజాగా సవరించింది.
PhonePe | డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే తన వినియోగదారులకు షాకిచ్చింది. ఫోన్‌పేలో ఉన్న వాలెట్ సదుపాయాన్ని 365 రోజులకు పైగా ఉపయోగించకపోతే రూ.100 ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఫోన్‌పే తన వాలెట్ సేవలకు సంబంధించిన నిబంధనలను తాజాగా సవరించింది. ఈ కొత్త మార్పుల ప్రకారం ఫోన్‌పే వాలెట్‌ను దీర్ఘకాలం ఉపయోగించకపోతే వినియోగదారుల నుంచి కంపెనీ ఇనాక్టివిటీ మెయింటెనెన్స్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఫోన్‌పే యూజర్ తన ఫోన్‌పే వాలెట్ ద్వారా 365 రోజుల పాటు ఎలాంటి లావాదేవీ చేయకపోతే ఆ ఖాతాను ఇనాక్టివ్‌గా గుర్తిస్తుంది. ఆ ఖాతాకు రూ.100 ఇనాక్టివిటీ మెయింటెనెన్స్ ఫీజును విధిస్తారు. అయితే ఫోన్‌పే ఈ రూల్‌ను తెచ్చినట్లు ప్రకటించిన తరువాత సోషల్ మీడియాలో వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ఫోన్‌పే తీరును తప్పుబడుతూ విమర్శిస్తున్నారు.
ఫోన్‌పే నిర్ణయంపై వ్యతిరేకత..
ఇదే విషయమై సామాజిక వేదిక ఎక్స్‌లో చాలా మంది యూజర్లు ఫోన్‌పేకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. తాము ఇకపై ఫోన్‌పేను వాడబోమని తేల్చి చెబుతున్నారు. ఫోన్‌పేలో సంప్రదాయ యూపీఐ చెల్లింపుల ఆప్షన్‌తోపాటు వాలెట్ సదుపాయం కూడా ఉంటుంది. చాలా మంది యూపీఐ పేమెంట్ సదుపాయం, వాలెట్ రెండూ ఒకటేనని భావిస్తారు. కానీ ఇవి వేర్వేరు. ఫోన్‌పే వాలెట్‌ను వాడాలంటే వినియోగదారులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. దీంతో అందులో నగదు జమ చేసి చెల్లింపుల కోసం ఉపయోగించే వీలుంటుంది. అయితే ఇప్పుడు అదే వాలెట్‌కు గాను నిబంధనలను మార్చినట్లు ఫోన్‌పే వెల్లడించింది. సాధారణంగా ఇలాంటి వాలెట్ సదుపాయానికి ఇతర ప్లాట్‌ఫామ్‌లు ఇనాక్టివ్ ఫీజును వసూలు చేయడం లేదు. పేటీఎం, మొబిక్విక్, పేజాప్, అమెజాన్ పే వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు వాలెట్ సదుపాయాన్ని అందిస్తున్నప్పటికీ క్రెడిట్ కార్డు ద్వారా జమ చేసే నగదుకు మాత్రమే ఫీజును వసూలు చేస్తున్నాయి. కానీ వాలెంట్ ఇనాక్టివ్ మెయింటెనెన్స్ ఫీజును ఆయా ప్లాట్‌ఫామ్‌లు వసూలు చేయడం లేదు. అయితే ఫోన్‌పే ఈ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది కనుక ఇతర యాప్‌లు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం లేకపోలేదని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఏడాదిలో ఒక్కసారైనా వాడితే..
వినియోగదారులు ఉపయోగించని వాలెట్‌కు చార్జీలను వసూలు చేయడం సమంజసం కాదని అనేక మంది యూజర్లు అభిప్రాయపడతున్నారు. అయితే రూ.100 ఫీజు ప్రతి ఫోన్‌పే వినియోగదారుడికి వర్తించదు. కేవలం ఫోన్‌పే వాలెట్ ద్వారా ఏడాది పాటు ఎలాంటి లావాదేవీ చేయకపోతేనే ఈ ఫీజు వర్తిస్తుంది. యథావిధిగా వాలెట్‌ను వాడుకుంటే ఎలాంటి ఫీజు ఉండదని ఫోన్‌పే స్పష్టం చేసింది. ఇనాక్టివ్‌గా ఉండే వాలెట్ల వల్ల మెయింటెనెన్స్ భారం తప్ప తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఫోన్‌పే భావిస్తోంది. అందుకనే ఈ చార్జీలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.100 చార్జీని తప్పించుకోవాలంటే ఏడాదిలో కనీసం ఒక్కసారైనా ఫోన్‌పే వాలెట్‌ను వాడితే సరిపోతుంది. ఇక ఫీజు వసూలు చేసేందుకు 15 రోజుల ముందే ఫోన్ పే హెచ్చరిక సందేశాన్ని పంపిస్తుంది. కనుక ఆ సమయంలోనైనా సరే యూజర్ తన వాలెట్‌లో లావాదేవీని నిర్వహించవచ్చు. దీంతో రూ.100 ఫీజు నుంచి తప్పించుకోవచ్చు. అయినప్పటికీ ఫోన్ పే తీసుకున్న ఈ నిర్ణయంపై అధిక శాతం మంది వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..
- ●Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం
- ●HIV | హెచ్ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్ఐవీ-టు-హెచ్ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..
- ●Ramakrishna Rao | సీఎస్ రామకృష్ణా రావుకు మళ్లీ ఎక్స్ టెన్షన్?
- ●Revanth Reddy | ఆదిలాబాద్‌లో ఎయిర్‌లైన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయండి.. రాజ్‌నాథ్ సింగ్‌కి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Road Accident | 250 kmph వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. ఎగిరిపడ్డ మృతదేహాలు

Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..

Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం

HIV | హెచ్ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్ఐవీ-టు-హెచ్ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..

Ramakrishna Rao | సీఎస్ రామకృష్ణా రావుకు మళ్లీ ఎక్స్ టెన్షన్?






