BPCL Recruitment | భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు..
BPCL Recruitment | ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివిధ విభాగాల్లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 154 నాన్-మేనేజ్‌మెంట్ పోస్టులకు దరఖాస్తులు (BPCL Recruitment) ఆహ్వానిస్తున్నది.
BPCL Recruitment | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివిధ విభాగాల్లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 154 నాన్-మేనేజ్‌మెంట్ పోస్టులకు దరఖాస్తులు (BPCL Recruitment) ఆహ్వానిస్తున్నది. అర్హులైనవారు ఆగస్టు 13 వరకు అధికారిక వెబ్‌సైట్ www.bharatpetroleum.in. చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముంబై, కొచ్చి రిఫైనరీల్లో ఉన్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.26,500 నుంచి రూ.34,000 వరకు జీతం అందుతుంది. అలాగే, ఇతర అలవెన్సులు లభిస్తాయి.
మొత్తం ఖాళీలు: 154
ప్రాసెస్ ఆపరేటర్/ఆపరేటర్ (కెమికల్)- 64 (ఎస్సీ 6, ఎస్టీ 2, ఓబీసీ 17, ఈడబ్ల్యూఎస్ 6, జనరల్ 33)
ప్రాసెస్ టెక్నీషియన్ (కెమికల్)- 60 (ఎస్సీ 8, ఎస్టీ 14, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 6, జనరల్ 30)
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)- 17 (ఎస్సీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 7)
టెక్నీషియన్/ఆపరేటర్ (మెకానికల్)- 13 (ఎస్సీ 2, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, జనరల్ 8)
అర్హతలు: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది ఉద్యోగానుభవం అవసరం. 2026 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. నెగటివ్ మార్కులు లేవు. డైమెన్ నాలెజ్డ్ నుంచి 60 మార్కులు, జనరల్ అప్టిట్యూడ్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్) నుంచి 40 మార్కులు వస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 13
రాతపరీక్ష: సెప్టెంబర్‌లో
అడ్మిట్ కార్డులు: పరీక్షకు 10 రోజుల ముందు
పరీక్ష ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 10 రోజుల తర్వాత
వెబ్‌సైట్: https://www.bharatpetroleum.in
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ
- ●Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్

Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ

Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్






