త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO URSC Recruitment | ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ అర్హ‌త‌తో.. ఇస్రోలో టెక్నీషియ‌న్‌, డ్రైవ‌ర్ పోస్టులు

ISRO URSC Recruitment | బెంగ‌ళూరులోని ప్రతిష్ఠాత్మక యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (URSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Oct 29, 2026, 7.09 am IST

ISRO URSC Recruitment | ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ అర్హ‌త‌తో.. ఇస్రోలో టెక్నీషియ‌న్‌, డ్రైవ‌ర్ పోస్టులు
Advertisement

ISRO URSC Recruitment | త్రినేత్ర న్యూస్‌: బెంగ‌ళూరులోని ప్రతిష్ఠాత్మక యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (URSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 61 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఆస‌క్తి, అర్హత ఉన్నవారు యూఆర్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ursc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 13తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తుంది.

మొత్తం పోస్టులు: 61

టెక్నీషియన్ బీ- 46
లైట్ వెహికల్ డ్రైవర్- 5
హెవీ వెహికల్ డ్రైవర్- 10

అర్హ‌త‌: టెక్నీషియ‌న్ బీ పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణుల‌వ్వాలి. ఎన్‌టీసీ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. డ్రైవ‌ర్ పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తితోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌, అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థులు 18 నుంచి 35 ఏండ్ల‌ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు సమర్పించిన విద్యా అర్హతలు, మార్కులు, ఇతర వివరాల ఆధారంగా మొదట ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన ప్రతిభ, ఇస్రో లేదా యూఆర్‌ఎస్సీ నిర్ణయించిన కటాఫ్ నిబంధనలు, ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను తదుపరి దశ అయిన స్కిల్ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు.

రాత‌ప‌రీక్షలో మొత్తం 80 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 1 మార్కు. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్ర‌తిత‌ప్పు స‌మాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు. స్కిల్‌టెస్ట్ 100 మార్కుల‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ. 500. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ.400 రీఫండ్ చేస్తారు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 13
వెబ్‌సైట్‌: www.isro.gov.in

 

Advertisement
Advertisement