NHSRCL Recruitment | హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌లో టెక్నీషియన్ పోస్టులు..
NHSRCL Recruitment | నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) 237 టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా చేసినవారు ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NHSRCL Recruitment | త్రినేత్ర.న్యూస్: నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) 237 టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా చేసినవారు ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిగ్నలింగ్ అండ్ టెలికాం, రోలింగ్ స్టాక్ మొదలైన విభాగాల్లో ఉన్నాయి. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో ఎంపిక చేస్తారు. ఉద్యోగం వచ్చిన వారు ప్రతి నెల రూ.35,000 నుంచి రూ.1,10,000 వంరకు వేతనం అందుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 237
ఇందులో టెక్నీషియన్ సివిల్, ట్రాక్ మెకానిక్ 16, డ్రాట్స్‌మ్యాన్ 8, సర్వేయర్ 7, ఎలక్ట్రిషియన్ 8, వెల్డర్ 6, సివిల్ ప్లంబర్ 2, పెయింటర్ 2, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 77, సిగ్నలింగ్ అండ్ టెలికం 63, రోలింగ్ స్టాక్, ఫిట్టర్ 10, మెషినిస్ట్ 2, వెల్డర్ 2, ఎలక్ట్రిషియన్ 13, ఆర్ఏసీ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదోతరగతి, ఫిట్టర్, మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సర్వేయర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌తో ఐటీఐ చేయాలి. లేదా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌తో ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏండ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ), ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలతో ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు ఏడాది ప్రొబేషన్‌లో కొనసాగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.400, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5
వెబ్‌సైట్: https://nhsrcl.in/
సంబంధిత వార్తలు

BPCL Recruitment | భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు..
జులై 31, 2026

NPCIL | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో టెక్నీషియన్ పోస్టులు.. 15 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు షురూ..
జులై 13, 2026

RRB Technician | రైల్వేలో 6565 టెక్నీషియన్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లోనూ ఖాళీలు.. దరఖాస్తులు షురూ..
జులై 1, 2026
తాజావార్తలు
- ●Faruk G Patel Success Story | ఆటో నడిపాడు, పిజ్జాహట్‌లో పని చేశాడు.. నేడు రూ.10,964 కోట్ల సామ్రాజ్యం
- ●Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ
- ●Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Faruk G Patel Success Story | ఆటో నడిపాడు, పిజ్జాహట్‌లో పని చేశాడు.. నేడు రూ.10,964 కోట్ల సామ్రాజ్యం

Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ

Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం



