India Student | కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచి
India Student | కెనడా (Canada)లో భారతీయ విద్యార్థిని (India Student) దారుణ హత్యకు గురైంది. మృతురాలు గుజరాత్ (Gujarat)లోని ఆనంద్ జిల్లా బోర్సాద్ నివాసి 22 ఏళ్ల విధి మేఘానిగా (Vidhi Kalpeshbhai Meghani) గుర్తించారు.
India Student | కెనడా (Canada)లో భారతీయ విద్యార్థిని (India Student) దారుణ హత్యకు గురైంది. నయాగరా ప్రాంతంలో యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. మృతురాలు గుజరాత్ (Gujarat)లోని ఆనంద్ జిల్లా బోర్సాద్ నివాసి 22 ఏళ్ల విధి మేఘానిగా (Vidhi Kalpeshbhai Meghani) గుర్తించారు. విధి నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. కెనడాలోని నయాగరా ప్రాంతంలో (Niagara region) నివసిస్తోంది. అక్కడ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటోంది. అయితే, ఈనెల 15న యూఎస్-కెనడా సరిహద్దుకు సమీపంలో విధి దారుణ హత్యకు గురైంది.
విధిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన విధి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కెనడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా మారిందన్న వార్త తెలియడంతో విధి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కాగా, విధి హత్యతో విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతం నుంచి ఏటా చాలా మంది విద్యార్థులు విద్య, ఉపాధి అవకాశాల కోసం కెనడా వంటి దేశాలకు వెళ్తుంటారు. దీంతో విధి మరణ వార్త ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
తాజావార్తలు
- ●Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ

Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల






