Rajnath Singh | నరవణే బుక్ వివాదం.. ఆర్మీ చీఫ్‌ల రచనలపై అలాంటి ఆంక్షలేవీ లేవు : రాజ్‌నాథ్ స్పష్టీకరణ
Rajnath Singh | రిటైర్డ్ ఆర్మీ అధికారులు (Retiring Military Officials) పుస్తకాలు రాసేందుకు తప్పనిసరిగా 20 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ (20 Year Cooling Off Period) ఇచ్చే ప్రతిపానేదీ లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.
Rajnath Singh | రిటైర్డ్ ఆర్మీ అధికారులు (Retiring Military Officials) పుస్తకాలు రాసేందుకు తప్పనిసరిగా 20 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ (20 Year Cooling Off Period) ఇచ్చే ప్రతిపానేదీ లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఆదివారం విలేకరులతో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించి ప్రతిపాదనేదీ క్యాబినెట్ ముందుకు చర్చకు రాలేదని చెప్పారు. ఆర్మీ అధికారులు పదవీ విరమణ పొందిన తర్వాత వెంటనే పుస్తకాలు రాయడంపై ఎలాంటి పరిమితి లేదా నిషేధం ఉండదని వెల్లడించారు.
కాగా, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ (Four Stars of Destiny) పుస్తకంపై ఇటీవలే వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను లోక్‌సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది. ఈ వివాదం నేపథ్యంలో ఆర్మీ అధికారులు రిటైర్ అయిన తర్వాత పుస్తకాలు రాసేందుకు 20 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇచ్చే ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రాజ్‌నాథ్ తాజాగా స్పష్టతనిచ్చారు.
పదవీ విమరణ చేసిన అధికారులు రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకూడదనే నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని వెల్లడించారు. "ఏదైనా సున్నితమైన సమాచారాన్ని ప్రచురించడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాబట్టి కొత్తగా 20 సంవత్సరాల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయి" అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. జనరల్ నరవణే పుస్తకంలో జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉన్న కారణంగా 2024లో విడుదల కావాల్సిన పుస్తకం రక్షణ శాఖ సమీక్ష పేరిట పెండింగ్‌లో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rajnath Singh | జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తారాగిరి.. హాజరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్..
ఏప్రిల్ 3, 2026

Rafale | మెగా డీల్‌లో మేక్ ఇన్ ఇండియాకే అధిక ప్రాధాన్యం.. రఫేల్ జెట్స్‌లో 50 శాతం దేశీయ పరికరాలే : రాజ్‌నాథ్ సింగ్
ఫిబ్రవరి 18, 2026

Kiren Rijiju | సరిహద్దు విషయాల గురించి రాహుల్‌కు అవగాహన లేదు : కిరణ్ రిజుజు
ఫిబ్రవరి 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



