త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajnath Singh | బంగ్లాదేశ్‌ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్‌ కుట్ర : రాజ్‌నాథ్ సింగ్‌

Rajnath Singh | కాంగ్రెస్ (Congress) పార్టీ దాని మిత్ర‌ప‌క్షాల‌పై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. దేశంలో బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వ మార్పుకు (Bangladesh-like regime change) విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగాన్ని త‌న జేబులో పెట్టుకుని అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

D

National | Published On Oct 16, 2026, 12.36 pm IST

Rajnath Singh | బంగ్లాదేశ్‌ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్‌ కుట్ర : రాజ్‌నాథ్ సింగ్‌
Advertisement

Rajnath Singh | త్రినేత్ర న్యూస్ : ఈసీకి వ్య‌తిరేకంగా ఢిల్లీలో జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌పై కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్రంగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ (Congress) పార్టీ దాని మిత్ర‌ప‌క్షాల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. దేశంలో బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వ మార్పుకు (Bangladesh-like regime change) విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపించారు. దేశంలో అల్ల‌ర్లు సృష్టించేందుకు యువ‌త‌ను వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడమే వారి లక్ష్యమని విమర్శించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌క్నోలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. "దేశంలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాల (INDIA) ఆధ్వర్యంలో జరుగుతున్ననిరసనలు కేవలం ఎన్నికల సంస్కరణల కోసం కాదు. 2024లో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తరహాలోనే ఇక్కడ కూడా ప్రభుత్వ మార్పు (Regime Change) తీసుకురావడానికి విపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. ప్రభుత్వాన్ని పడగొడతామని ఒకరు బహిరంగంగా చెబుతుంటే.. ప్రభుత్వ మార్పు కోసం తాము బంగ్లాదేశ్ స్ఫూర్తిని తీసుకున్నామని మ‌రికొంద‌రు ప్రెస్ మీట్లు పెట్టి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడం, దేశంలో అగ్గి రాజేయడమే వారి ఏకైక అజెండా అని దీన్ని బ‌ట్టే స్ప‌ష్ట‌మ‌వుతోంది" అని రాజ్‌నాథ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ప్ర‌తిప‌క్షాలు దేశంలోని యువతను, విద్యార్థులను దేశ అభివృద్ధికి కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం అరాచక రాజకీయాల్లోకి లాగుతూ వారిని పావులుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి, రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడానికి, భారతదేశ అభివృద్ధికి అడ్డు తగలడానికి ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని విప‌క్షాలు గ్ర‌హించాలంటూ హిత‌వు ప‌లికారు.

కాంగ్రెస్‌ గతంలోనూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను దెబ్బతీసిందని రాజ్‌నాథ్‌ విమర్శించారు. ఈ సంద‌ర్భంగా 1975 నాటి అత్యవసర పరిస్థితి (Emergency), 1984 సిక్కుల వ్యతిరేక హింస వంటి సంఘటనలను గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వ‌ర‌కూ ఆ పార్టీ ప్రజాస్వామ్య విలువలను ఎప్పుడూ గౌరవించలేదని ఆరోపించారు. 1975లో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు.. ఇప్పుడు రాహుల్‌ గాంధీ రాజ్యాంగాన్ని త‌న జేబులో పెట్టుకుని అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాహుల్ గాంధీ విధ్వంసకర రాజకీయాలను విడనాడి, ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, దేశంలో అరాచకం సృష్టించే హక్కు ఎవరికీ లేదని ఈ సంద‌ర్భంగా ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Also Read..

నెలాఖ‌రులో పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు..? మ‌ళ్లీ తెర‌పైకి డీలిమిటేష‌న్‌, మ‌హిళా బిల్లులు

రూ.425.50 కోట్ల వ్య‌యంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

స్టార్‌లింక్‌కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్

Advertisement
Advertisement