Car Falls into Well | బావిలో పడిన కారు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
Car Falls into Well | మహారాష్ట్రలోని నాశిక్ (Nashik) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి నాశిక్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది (Car Falls into Well). దీంతో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారు.
Car Falls into Well | త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్రలోని నాశిక్ (Nashik) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి నాశిక్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది (Car Falls into Well). దీంతో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారు. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తున్నది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
నాశిక్ జిల్లాలోని దిండోరి తాలూకా శివాజీనగర్ ప్రాంతంలోని రాజ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం ఒక ప్రైవేట్ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. ఆ కార్యక్రమానికి నగరం, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో చిన్నారులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈవెంట్ ముగిసిన తర్వాత, దిండోరికి చెందిన దర్గోడే కుటుంబం ఎర్టిగా కారులో ఇంటికి తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు ఓ పొలంలో ఉన్న బావిలో పడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బావిలో నిండుగా నీరు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో రెండు క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో కారును, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మృతులను రాఖీ సునీల్ దర్గోడ్, ఆశా అనిల్ దర్గోడ్, సృష్టి అనిల్ దర్గోడ్, సునీల్ దర్గోడ్, శ్రేయాష్ దర్గోడ్, మాధురి దర్గోడ్, సమృద్ధి దర్గోడ్, రేష్మా దర్గోడ్, శ్రావణి దర్గోడ్గా పోలీసులు గుర్తించారు. అంతా 7 నుంచి 32 ఏండ్ల వయస్సులోపువారే కావడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Nashik, Maharashtra: A car fell into a water-filled well in Shivaji Nagar, Dindori, last night, killing nine members of the same family. They were returning home after attending an event when the driver lost control and the car plunged into the well. Dindori police have… pic.twitter.com/mdHK6Tmftx
— ANI (@ANI) April 4, 2026
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

NEET UG | 10 లక్షలకు కొని, 15 లక్షలకు అమ్మాడు.. నీట్ పేపర్ లీక్ కేసులో విద్యార్థి అరెస్ట్
మే 13, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



