త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు

CM Revanth Reddy | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు బ్ర‌హ్మాండ‌మైన చ‌దువు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌యివేటు స్కూళ్ల మోజులో ప‌డ‌కుండా.. పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పంపించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Mar 22, 2026, 7.17 pm IST

CM Revanth Reddy | ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు
Advertisement

ప్ర‌యివేటు స్కూళ్ల మోజులో ప‌డ‌కండి..
పైస‌లు ఖ‌ర్చు పెట్టి న‌ష్టపోకండి
బ్ర‌హ్మాండ‌మైన చ‌దువు చెప్పేందుకు సిద్ధంగా టీచ‌ర్లు
18 వేల‌కు పైగా స్కూళ్ల‌ల్లో ల‌క్ష‌కు పైగా టీచ‌ర్లు
ఐటీఐ, పాలిటెక్నిక్ చ‌దువుకుంటే ఉద్యోగం ఇప్పించే బాధ్య‌త నాది
ఆ మూడు భాష‌లు వ‌స్తే ఉద్యోగం వెతుక్కుంటూ వ‌స్తుంది

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు బ్ర‌హ్మాండ‌మైన చ‌దువు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌యివేటు స్కూళ్ల మోజులో ప‌డ‌కుండా.. పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పంపించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. సిద్దిపేట జిల్లాలోని న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

కాలే క‌డుపుతో పిల్ల‌లు బ‌డికి పోతే అర్ధాక‌లితో అర్థం కాదు. ఇవ‌న్నీ ఆలోచ‌న చేసి ఈ ఏడాది నుంచి తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్స్ న‌ర్స‌రీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ పాఠ‌శాల‌ల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్ అంద‌జేస్తాం. మూడు రోజులు రాగి జావ‌, మూడు రోజులు పాలు ఇస్తాం. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేస్తాం. ప్ర‌యివేటు స్కూళ్ల మోజులో ప‌డ‌కండి. పైస‌లు ఖ‌ర్చు పెట్టి న‌ష్టం కాకండి. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్లు అత్య‌ధికంగా చ‌దువుకున్నారు. బ్ర‌హ్మాండ‌మైన చ‌దువు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 18 వేల‌కు పైగా స్కూళ్ల‌ల్లో ల‌క్ష‌కు పైగా టీచ‌ర్లు ఉన్నారని సీఎం తెలిపారు.

సాంకేతి నైపుణ్యం ఉన్న విద్య వైపు వెళ్లాలి..

ఇంజినీరింగ్, డాక్ట‌ర్ చ‌దువుకుంటే ఉద్యోగం వ‌స్త‌దో రాదో నాకు తెలియ‌దు. కానీ ఐటీఐ, పాలిటెక్నిక్ చ‌దువుకుంటే ఉద్యోగం ఇప్పించే బాధ్య‌త నాది. మంచి ప‌ని నేర్చుకున్నోడికి.. నెల‌కు 50 వేలు సంపాదించుకుంటారు. కాలం మారింది.. ప‌ని కూడా నేర్చుకోవాలి. నైపుణ్యంతో కూడిన కోర్సుల‌ను అభ్య‌సిస్తే నెల తిరిగే లోపు ల‌క్ష సంపాదించొచ్చు. ఏటీసీలో ప్ర‌తి విద్యార్థికి నెల‌కు రూ. 2 వేల చొప్పున‌ స్కాల‌ర్‌షిప్ ఇస్తాం. అందుకే విద్యార్థుల‌కు సూచ‌న చేస్తున్నా. మీ తెలివితేట‌ల‌ను ప్ర‌ద‌ర్శించండి. యూట్యూబ్‌లో పాట‌లు పాడేవారు కూడా ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నారు. కాబ‌ట్టి 12వ త‌ర‌గ‌తి త‌ర్వాత మూడు భాష‌లు వ‌చ్చి, ప‌ని చేసే తెలివి ఉంటే ఉద్యోగం వెతుక్కుంటూ వ‌స్తుంది. సాంకేతి నైపుణ్యం ఉన్న విద్య వైపు వెళ్లాలి. ఇవే జీవితాల్లో మార్పును తీసుకువ‌స్తాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement