Jayam Ravi | తిరుమలలో ప్రియురాలితో జయం రవి – ఓటు వేయకుండా రావడంపై నెటిజన్ల ట్రోలింగ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్, దళపతి విజయ్, ధనుష్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ జయం రవి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గురువారం ప్రియురాలు కెనీషాతో కలిసి జయం రవి తిరుమలకు రావడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Entertainment | Published On Apr 23, 2026, 3.36 pm IST
Jayam Ravi | తమిళనాడు అసెంబ్లీఎన్నికల వేళ హీరో జయం రవిని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. గురువారం జరుగుతోన్న ఎన్నికల్లో రజనీకాంత్, ధనుష్, అజిత్, శివకార్తికేయన్‌తో పాటు పలువురు తమిళ స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ జయం రవి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గురువారం రోజున ప్రియురాలు కెనీషాతో కలిసి తిరుమలకు వచ్చారు జయం రవి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
నెటిజన్ల విమర్శలు...
నెటిజన్లు మాత్రం జయం రవిని తెగ ట్రోల్ చేస్తున్నారు. సెలిబ్రిటీ అయ్యుండి ఓటింగ్‌కు దూరంగా ఉండటం సరికాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాల్లో హీరో అనిపించుకుంటే సరిపోదని, రియల్ లైఫ్‌లో అలాగే ఉండాలని అంటున్నారు.
పెళ్లి కుదిరిందా?
మరోవైపు సింగర్ కెనీషాను జయం రవి పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. పెళ్లి వార్తల నడుమ వీరిద్దరు తిరుమల రావడం ఆసక్తికరంగా మారింది. సింగర్ కెనీషా కారణంగానే జయం రవికి, అతడి భార్య ఆర్తికి మధ్య విభేదాలు మొదలైనట్లు కోలీవుడ్‌లో రూమర్లు వినిపిస్తున్నాయి. తన ఇష్టంతో సంబంధం లేకుండా జయం రవి విడాకుల ప్రకటన చేశారంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు నడుస్తోంది. తనతో పాటు తన పిల్లల పోషణ కోసం నెలకు నలభై లక్షల వరకు భరణంగా ఇవ్వాలని ఆర్తి పిటిషన్ వేసింది.
స్నేహం మాత్రమే...
మరోవైపు ఆర్తి ఆరోపణలను జయం రవి ఖండించారు. గత కొన్నేళ్లుగా ఆర్తి తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని, ఆస్తులన్నీంటిని తన పేరు మీదకు బదిలీ చేసుకుందని, తనకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి ఆస్తులు లేవని చెప్పారు. మరోవైపు సింగర్ కెనీషాతో తనకు ఉన్న స్నేహం మాత్రమేనని, కష్టసమయంలో తనకు అండగా నిలిచిందని చెప్పాడు.
ప్రస్తుతం తమిళంలో కరాటే బాబు, బ్రో కోడ్‌తో పాటు జీనీ సినిమాలు చేస్తున్నాడు జయం రవి.
సంబంధిత వార్తలు

Trisha | రాజకీయాల్లోకి త్రిష? – తమిళనాడులో వెలిసిన బ్యానర్లు – డీఎంకే సభలో చెన్నై క్వీన్ హవా
ఆగస్టు 3, 2026

Jayam Ravi | 40 లక్షలు అందుకే అడిగాం – దళపతి విజయ్‌ని చూసి నేర్చుకో – జయం రవిపై ఆర్తి తల్లి కామెంట్లు
ఆగస్టు 3, 2026

Vijay Trisha | విజయ్, త్రిష బ్లాక్‌బస్టర్ మూవీ 21 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ రిలీజ్ – తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే డిజాస్టర్
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్
- ●PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి
- ●Warren Buffett | రోజూ ట్రేడింగ్ చేసేవారికి వారెన్ బఫెట్ కీలక సూచనలు
- ●BJP | జెన్ జీ దెబ్బకు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓటమి
- ●Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ - ఇప్పుడు ప్రొడ్యూసర్ - నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
- ●FSSAI Norm Violations | మద్యం ప్రియులకు బిగ్ అలెర్ట్.. మూడు కంపెనీల లిక్కర్‌పై నిషేధం..!

Dasoju Sravan | రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్

PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి

Warren Buffett | రోజూ ట్రేడింగ్ చేసేవారికి వారెన్ బఫెట్ కీలక సూచనలు

BJP | జెన్ జీ దెబ్బకు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓటమి



