kalwakuntla Kavitha | ఫీజు నియంత్రణ చట్టం తేకపోతే ఉద్యమం తప్పదు: కవిత
Fee Regulation | తెలంగాణలో ఫీజు (Fee) పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ (private schools) విద్యార్థుల తల్లితండ్రులను దోపిడీ చేస్తున్నాయని, వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తేవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalwakuntla Kavitha) డిమాండ్ చేశారు. చట్టం రూపకల్పనకు అసెంబ్లీ సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో ఫీజు (Fee) పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ (private schools) విద్యార్థుల తల్లితండ్రులను దోపిడీ చేస్తున్నాయని, వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తేవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalwakuntla Kavitha) డిమాండ్ చేశారు. చట్టం రూపకల్పనకు అసెంబ్లీ సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా 8 శాతానికి మించి ఫీజు పెంచటాన్ని ప్రభుత్వం నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు పెంపును బీఆర్ఎస్ ప్రోత్సహించిందని, పట్టించుకోకపోతే బీఆర్ఎస్ గతే కాంగ్రెస్ కు పడుతుందన్నారు.
తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం కవిత మీడియాతో మాట్లాడారు. ఒకేసారి 30-40 శాతం ఫీజులు పెంచి తల్లితండ్రులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నారాయణ, చైతన్య స్కూల్స్ లో ఫుడ్ సేప్టీ, టీచర్ల పీఎఫ్ వంటి అంశాలపై రైడ్స్ చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మొత్తం 39, 641 స్కూల్స్ ఉంటే అందులో దాదాపు 62 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 27, 581 ప్రభుత్వ పాఠశాలలుంటే 12, 061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతుంటే 38 లక్షల మంది ప్రైవేట్ లో చదువుతున్నారు. ప్రైవేట్ లో మళ్లీ 350 స్కూల్స్ స్పెషలైజ్డ్ గా ఉన్నాయి. వాటిల్లో 3 లక్షల మంది చదువుతున్నారు. నారాయణ, చైతన్య వంటి 1200 కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో 5 లక్షల మంది చదువుతున్నారు. మిగతా స్కూల్స్ లో మిగిలిన విద్యార్థులు చదువుతున్నారు. 236 బడ్జెట్ స్కూల్స్ ఉంటే వాటిలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం 42 వేలు ఇస్తుంది. ఇది మన రాష్ట్రంలోని స్కూల్ విద్యకు సంబంధించిన స్వరూపం అని కవిత వెల్లడించారు.
ఒకేసారి 60 శాతం కట్టాలంటూ ఒత్తిడి..
ఐతే ఏప్రిల్ కూడా రాకముందే ప్రైవేట్ స్కూల్స్ 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయి. లక్ష రూపాయలు ఫీజు ఉంటే ఇప్పుడు మరో 30 వేలు భారం కానుంది. దీనిపై హైదరాబాద్ లో చాలా స్కూల్స్ వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారు. ఒకేసారి 60 శాతం ఫీజు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముూడేళ్లైనా ఫీజు నియంత్రణ జరగకపోవటం సిగ్గుచేటని ఆమె ఫైరయ్యారు.
తల్లిదండ్రులకు జీతాలు పెరగవు..
మొన్నటి విద్యా కమిషన్ రిపోర్ట్ చెత్తగా ఉన్నప్పటికీ అందులో ఒక పాయింట్ బాగుంది. ఏటా ఫీజును 7 నుంచి 8 శాతం పెంచుకోవచ్చని సూచించారు. కనీసం దాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. 8 శాతం కన్నా ఎక్కువ ఫీజు పెంచితే కఠిన చర్యలు ఉండాలి. ఒకేసారి 30 నుంచి 40 శాతం పెంపు అంటే పేద, మధ్య తరగతి వాళ్లకు కష్టమవుతుంది. మీరు ఫీజులు పెంచిన విధంగా పిల్లల తల్లితండ్రులకు జీతాలు పెరగవు. ఫీజులు పెంచినప్పటికీ నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ లో టీచర్లకు జీతాలు పెంచరు. పీఎఫ్ కూడా ఇవ్వటం లేదు. ప్రైవేట్ టీచర్ల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తేనే ఫుడ్ సెక్యురిటీ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. నారాయణ, చైతన్య వంటి స్కూల్స్ లో ఒకే దగ్గర పదివేల మందికి ఫుడ్ తయారు చేస్తున్నారు. ఫుడ్ శాంపిల్స్ ను చెక్ చేయాలి అని డిమాండ్ చేశారు.
బీసీల పిల్లలకు రూ.42 వేలు ఇవ్వాలి..
ప్రైవేట్ ను నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్ కు వెళ్తున్నాడు. అంటే ప్రైవేట్ దోపిడీని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఆయనే సంకేతాలు ఇస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన 42 వేల రూపాయలు ఇవ్వకపోవటంతో 212 కోట్ల బకాయిలు పేరుకపోయాయి. ఆయా స్కూల్స్ యాజమాన్యాలు పిల్లల వద్ద ఫీజు వసూలు చేస్తున్నాయి. బీసీల్లో ఆదాయం తక్కువ ఉన్న పిల్లలకు కూడా 42 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి రూ.11 వేల కోట్లు బకాయిలున్నాయి. వాటిలో ఇంజినీరింగ్ కాలేజ్ లకు సంబంధించి 7 వేల 5 వందల కోట్లు బకాయిలు ఉన్నాయి అని కవిత వివరించారు.
అలెన్, ఎక్స్ లెన్స్, రెజిలెన్స్, ఫిజిక్స్ వాలా అంటూ నార్త్ స్కూల్స్ పెడుతూ వాటిల్లో ఉద్యోగాలు నార్త్ వాళ్లకే ఇస్తున్నారు. తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వని స్కూల్స్ కు ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వొద్దు. అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులకు పర్మిషన్లు ఇవ్వండి. వాళ్లైనా బతుకుతారు. కొన్ని స్కూల్స్ పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాయి. పేరెంట్స్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వారిని పురుగుల్లా చూస్తున్న స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి. నారాయణ, చైతన్య స్కూల్స్ ఏటా 15 వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. కానీ రకరకాల పేర్లతో ట్యాక్స్ కట్టకుండా ఎగగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు.
విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండడం మన ఖర్మ...
2 వేల రూపాయల పుస్తకాలకు 15 వేలు వసూలు చేస్తున్నారు. నారాయణ, చైతన్య స్కూల్స్ వాళ్లకు ప్రత్యేకంగా ప్రింటింగ్ యూనిట్స్ ఉన్నాయి. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం మన ఖర్మ. ఎన్నికల వరకు విద్యార్థుల అంశాన్ని రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కూడా కనీసం రివ్యూ చేయటం లేదు.
అన్ని పాఠశాలల ముందు ధర్నా చేస్తం..
తెలంగాణ వాళ్లకు అన్యాయం జరగవద్దని నిజామాబాద్ జిల్లాకు నారాయణ, చైతన్య స్కూల్స్ ను రానివ్వలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ స్కూల్స్ వచ్చేశాయి. ప్రభుత్వ పరంగా ఈ అంశంపై కచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. స్కూల్స్ లో ఎంప్లాయిమెంట్ విషయంలో మన వాళ్లకు అవకాశం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ లో వేలాది మంది చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. వారికి అన్యాయం జరగకుండా మేము పోరాటం చేస్తాం. మేము డిమాండ్ చేసిన అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జాగృతి పక్షాన అన్ని స్కూల్స్ ముందు ధర్నా చేస్తాం అని హెచ్చిరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




