Police Recruitment | పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన భక్తప్రహ్లాదుడు.. న్యూస్..స్పేస్ రాణి.. తుఫెయిల్
Police Recruitment | మొన్న నీట్ పేపర్ లీక్, నిన్న జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల పేపర్లు లీక్, నేడు ఛత్తీస్‌గఢ్ పోలీసు నియామక పరీక్షల (Police Recruitment) ఫలితాలు.. ఇలా ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లు, రిక్రూట్‌మెంట్ పరీక్షలు.. ఇలా పరీక్ష ఏదైనా లీక్‌కు అతీతం కాదని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి.
Police Recruitment | త్రినేత్ర.న్యూస్: మొన్న నీట్ పేపర్ లీక్, నిన్న జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల పేపర్లు లీక్, నేడు ఛత్తీస్‌గఢ్ పోలీసు నియామక పరీక్షల (Police Recruitment) ఫలితాలు.. ఇలా ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లు, రిక్రూట్‌మెంట్ పరీక్షలు.. ఇలా పరీక్ష ఏదైనా లీక్‌కు అతీతం కాదని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఓవైపు జార్ఖండ్ నియామక పరీక్షల్లో అవకతవలు జరిగాయని పెద్దఎత్తున్న ఉద్యమం జరుగుతుండగానే.. ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) మరో వ్యవహారం బయటకు వచ్చింది. ఆ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో న్యూస్, స్పేస్ రాణి, హే రామ్, తుఫెయిల్, భక్త ప్రహ్లాద వంటి అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఈ పేర్లపై రాజకీయ రగడ కొనసాగుతున్నది.

ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (CGPSC) సుబేదార్, సబ్ ఇన్‌స్పెక్టర్, ప్లాటూన్ కమాండర్ వంటి 341 పోస్టుల భర్తీకి జూలై 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఆగస్టు 4న ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మెయిన్స్‌కు 7,301 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారి పేర్లను సీజీపీఎస్సీ విడుదల చేసింది. ఆ జాబితాలో న్యూస్ (News), స్పేస్ రాణి (Space Rani), హే రామ్ (He Ram), భక్త ప్రహ్లాద్ (Bhakt Prahlad), తుఫెయిల్ (Tufail), న్యూస్ కుమార్ ప్రధాన్ వంటి పేర్లను చూసి జనం అవాక్కయారు. అయితే అవి తమ పేర్లే నంటూ పలువురు అభ్యర్థులు మీడియా ముందుకు రావడం గమనార్హం. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు అందించిన సమాచారమే రికార్డుల్లో ఉందని సీజీపీఎస్సీ వెల్లడించింది.

కాగా, పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఈ విజయాన్ని బహిరంగంగా ప్రదర్శించడానికి పబ్లిక్ రిలేషన్స్ శాఖ రోజుకు రూ.కోటి ఖర్చు చేయాలి. దీంతో రాబోయే రోజుల్లో రేడియో, స్పేస్ రాజా కూడా ఏదో ఒక పరీక్షలో విజయం సాధించవచ్చని మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నదని విమర్శించారు.
తాజావార్తలు
- ●Tirupati-Karimnagar Express | మారిన తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు.. పెరిగిన ప్రయాణ సమయం!
- ●Horoscope | ఆగస్టు 8 రాశి ఫలాలు.. ఈ రాశివారు పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు!
- ●Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
- ●Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

Tirupati-Karimnagar Express | మారిన తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు.. పెరిగిన ప్రయాణ సమయం!

Horoscope | ఆగస్టు 8 రాశి ఫలాలు.. ఈ రాశివారు పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు!

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం






