త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Udhayanidhi Stalin | ఇక కాంగ్రెస్‌ను ఎప్ప‌టికీ న‌మ్మొద్దు: ఉద‌య‌నిధి స్టాలిన్‌

| Udhayanidhi Stalin | కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణమని.. డీఎంకే కార్య‌క‌ర్త‌ల‌ అండ‌తో సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేత‌ల‌కు క‌నీస కృత‌జ్ఞ‌త‌, మ‌ర్యాద లేదని డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. తమిళగ వెట్రి కజగంకి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆయ‌న పై విధంగా స్పందించారు.

S

National | Published On May 24, 2026, 11.43 am IST

Udhayanidhi Stalin | ఇక కాంగ్రెస్‌ను ఎప్ప‌టికీ న‌మ్మొద్దు: ఉద‌య‌నిధి స్టాలిన్‌
Advertisement

Udhayanidhi Stalin | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణమని.. డీఎంకే కార్య‌క‌ర్త‌ల‌ అండ‌తో సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేత‌ల‌కు క‌నీస కృత‌జ్ఞ‌త‌, మ‌ర్యాద లేదని డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ విమ‌ర్శించారు. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారన్నారు. కానీ కొన్ని పదవుల కోసం వారు త‌మకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించారు. వాళ్లను ఎప్పటికీ దరిదాపుల్లోకి రానివ్వొద్ద‌ని పార్టీ క్యాడ‌ర్‌కు సూచించారు. డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. తమిళగ వెట్రి కజగంకి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆయ‌న పై విధంగా స్పందించారు.

డీఎంకే క్యాడర్ అండతో సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత లేద‌న్నారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలుపున‌కు ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని అనుకునేవాడిని. కానీ భారత్‌లో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోశారు అని ఉదయనిధి స్టాలిన్ వివ‌రించారు.

యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) ఓటర్లకు రాజకీయంగా అవగాహన కల్పించాలని సూచించారు. తొలిసారి ఓటు వేసే వారిలో రాజకీయ చైతన్యంపై అవ‌గాహ‌న కల్పించాల‌ని డీఎంకే యువజన విభాగం కార్యకర్తలకు ఉదయనిధి స్టాలిన్ సూచించారు.

Advertisement
Advertisement