త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

NEET UG | నీట్ యూజీ (NEET UG) 2026 తొలి విడ‌త సీట్ల కేటాయింపు ఫ‌లితాలు వాయిదా ప‌డ్డాయి. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 19న ఫ‌లితాలు (NEET UG Round 1 Result) వెలువ‌డాల్సి ఉన్న‌ది.

G

National | Published On Aug 20, 2026, 6.11 am IST

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
Advertisement

NEET UG | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ యూజీ (NEET UG) 2026 తొలి విడ‌త సీట్ల కేటాయింపు ఫ‌లితాలు వాయిదా ప‌డ్డాయి. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 19న ఫ‌లితాలు (NEET UG Round 1 Result) వెలువ‌డాల్సి ఉన్న‌ది. అయితే తొలి విడ‌త సీట్ల‌ను శుక్ర‌వారం (ఆగ‌స్టు 21) విడుల చేయ‌నున్న‌ట్లు ఎంసీసీ వెల్ల‌డించింది. మొదటి విడ‌త‌ కౌన్సెలింగ్‌కు (NEET UG Counselling) నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో చూసుకోవ‌చ్చు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 31 వరకు సంబంధిత వైద్య కళాశాలల్లో నేరుగా హాజరై రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రవేశం పొందిన విద్యార్థుల సమాచారాన్ని కాలేజీల‌ యాజమాన్యాలు సెప్టెంబర్ 1న ధ్రువీకరిస్తాయి.

ఎండీఎస్ కౌన్సెలింగ్..

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా డెంట‌ల్ పీజీ (MDS) కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నీట్ ఎండీఎస్ కౌన్సెలింగ్ రౌండ్‌-1 రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప‌రీక్ష అర్హ‌త సాధించినవారు వెబ్‌సైట్ mcc.nic.in ద్వారా ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కౌన్సెలింగ్ ద్వారా 50 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్ల‌తోపాటు సెంట్ర‌ల్‌, డీమ్డ్ యూనివ‌ర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ సంస్థ‌ల్లో ఎండీఎస్ సీట్ల‌ను భ‌ర్తీ చేస్తారు.

  • రౌండ్‌-1 రిజిస్ట్రేష‌న్‌, చాయిస్ ఫిల్లింగ్ ప్ర‌క్రియ‌- ఆగ‌స్టు 23 వ‌ర‌కు
  • సీట్ల కేటాయింపు ఫలితాలు- ఆగ‌స్టు 26
  • విద్యార్థులు రిపోర్టు చేయ‌డానికి- ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు

 

Advertisement
Advertisement