త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vikarabad | వికారాబాద్‌లో విషాదం.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉరివేసి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ల్లి

Vikarabad | వికారాబాద్ (Vikarabad) జిల్లా వెంక‌టాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపిన త‌ల్లి, తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

G

Telangana | Published On Jun 14, 2026, 12.16 pm IST

Vikarabad | వికారాబాద్‌లో విషాదం.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉరివేసి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ల్లి
Advertisement

Vikarabad | త్రినేత్ర‌.న్యూస్‌: వికారాబాద్ (Vikarabad) జిల్లా వెంక‌టాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపిన త‌ల్లి, తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంది. గ్రామానికి చెందిన న‌వ‌నీత గ‌త కొంత కాలంగా కుటుంబ స‌మ‌స్య‌ల‌తో తీవ్ర మ‌నస్థాపానికి గురైంది. ఈ క్ర‌మంలో తన ఏడేండ్ల కుమారుడు విఘ్నేష్, ఐదేండ్ల‌ కుమార్తె మధుప్రియలకు ఇంట్లోనే ఉరివేసి హతమార్చింది. అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న‌ది.

స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద అలుముకున్నాయి.

ట్యాగ్స్:

Advertisement
Advertisement