NEET UG | ఎల్లుండి నీట్ యూజీ.. హాల్ టికెట్లు తీసుకుంది 16 లక్షల మందే!
NEET UG | నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) యూజీ–2026 పరీక్ష మరో రెండు రోజుల్లో జరుగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్ కార్డులను (admit cards) ఈ నెల 14న విడుదల చేసింది. అయితే నీట్ యూజీ (NEET UG) అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడం ఓ ప్రహసనంగా మారింది.
NEET UG | త్రినేత్ర.న్యూస్: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) యూజీ–2026 పరీక్ష మరో రెండు రోజుల్లో జరుగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్ కార్డులను (admit cards) ఈ నెల 14న విడుదల చేసింది. అయితే నీట్ యూజీ (NEET UG) అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడం ఓ ప్రహసనంగా మారింది. ఎన్టీఏ వెబ్‌సైట్‌లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నాలుగు రోజులైనా అభ్యర్థులందరూ హాల్‌టికెట్లు పొందలేని దుస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 22,79,743 మంది నీట్ రాయాల్సి ఉండగా, బుధవారం రాత్రికి 16 లక్షల మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎన్టీఏ వెల్లడించింది. నిమిషాల్లోనే డౌన్‌లోడ్ కావాల్సిన హాల్ టికెట్లు, ఏకంగా రోజుల తరబడి పడుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు చెల్లించిన దరఖాస్తు ఫీజును రిఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఒక్కసారిగా సర్వర్లపై లోడ్ పెరగడంతో చాలామందికి అకౌంట్ వివరాలు సబ్మిట్ కాకపోగా, హాల్‌టికెట్లు హోల్డ్‌లో పడిపోయాయి. దీంతో విద్యార్థులు అవస్థలుపడ్డారు. ఈనేపథ్యంలో బ్యాంక్ వివరాలు తర్వాత సమర్పించేలా ప్రత్యామ్నాయ ఆప్షన్లు ఇచ్చింది. అయినప్పటికీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Worker Abducted | పని మానేశాడని.. బలవంతంగా ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..
- ●Engineering Counselling | నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. 28 వరకు స్లాట్ బుకింగ్..
- ●Horoscope | జూన్ 19 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం ఉంటుంది!
- ●Manali Cost Of Living | మనాలిలో నెలకు రూ.5 వేల అద్దె, 300 కరెంట్ బిల్లు: పర్వతాల్లో 'రిమోట్ వర్క్' చేస్తున్న జంట బడ్జెట్ చూస్తే షాకే!
- ●US Grass Cutter Salary | అమెరికాలో గడ్డి కోస్తే రూ.15 లక్షల జీతం, ఆడి కారు సొంతం! నెట్టింట వైరల్ అవుతున్న భారతీయుడి వీడియో.. అసలు నిజమెంత?
- ●Sara Arjun | సద్గురు 'ఇషా ఆశ్రమం' నా సెకండ్ హోమ్.. అక్కడికే పరుగెత్తుకుంటూ వెళ్తా: నటి సారా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

Worker Abducted | పని మానేశాడని.. బలవంతంగా ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..

Engineering Counselling | నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. 28 వరకు స్లాట్ బుకింగ్..

Horoscope | జూన్ 19 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం ఉంటుంది!

Manali Cost Of Living | మనాలిలో నెలకు రూ.5 వేల అద్దె, 300 కరెంట్ బిల్లు: పర్వతాల్లో 'రిమోట్ వర్క్' చేస్తున్న జంట బడ్జెట్ చూస్తే షాకే!






