US-India Trade Deal | ట్రంప్ టారిఫ్ తగ్గింపు.. ప్రధాని మోదీని సత్కరించిన ఎన్డీఏ ఎంపీలు
US-India Trade Deal | భారత ఉత్పత్తులపై టారిఫ్‌ను తగ్గిస్తూ అమెరికా (India-US Trade Deal) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
US-India Trade Deal | భారత ఉత్పత్తులపై టారిఫ్‌ను తగ్గిస్తూ అమెరికా (India-US Trade Deal) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత దిగుమతులపై ఉన్న పరస్పర (రెసిప్రొకల్) టారిఫ్‌ను 25 నుంచి 18 శాతానికి తక్షణమే తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
ట్రంప్ ప్రకటనపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ (PM Modi) కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీని ఎన్డీఏ ఎంపీలు (NDA MPs) ఘనంగా సత్కరించారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీలు జై మోదీ, వందేమాతరం, భారత్ మాతా కీ జై వంటి నినాదాలు చేశారు.
https://x.com/ANI/status/2018541281971171760
ట్రంప్ ప్రకటన..
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం, భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ తగ్గింపును ప్రకటించింది. కొత్త ట్రేడ్ డీల్ ప్రకారం, భారత దిగుమతులపై ఉన్న పరస్పర ( రెసిప్రొకల్) టారిఫ్‌ను 25 నుంచి 18 శాతానికి తక్షణమే తగ్గిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ఈ టారిఫ్ తగ్గింపు మోదీ అభ్యర్థన మేరకే అమలులోకి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో, భారత్ కూడా అమెరికా ఎగుమతులపై ఉన్న టారిఫ్‌లు, నాన్-టారిఫ్ ఆంక్షలను క్రమంగా సున్నా స్థాయికి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు.
ఇక టారిఫ్ తగ్గింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. అయితే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు కారణంగా భారత్‌పై విధిస్తున్న మరో 25 శాతం అదనపు పన్ను విషయంలో స్పష్టత రాలేదు. కానీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపి వేసిన మరుక్షణమే ఆ 25 శాతం టారిఫ్ ను కూడా ఎత్తేస్తామని ట్రంప్ తెలిపినట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






