త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NCL Recruitment | నార్త‌ర్న్ కోల్డ్‌ఫీల్డ్స్‌లో 259 మైనింగ్ సిర్దార్‌, స‌ర్వేయ‌ర్ ఉద్యోగాలు..

NCL Recruitment | ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) అనుబంధ కంపెనీ నార్త‌ర్న్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) మైనింగ్ సిర్దార్ (Mining Sirdar), స‌ర్వేయ‌ర్ (Surveyor) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 259 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల (NCL Recruitment) చేసింది.

G

National | Published On Jul 14, 2026, 11.16 am IST

NCL Recruitment | నార్త‌ర్న్ కోల్డ్‌ఫీల్డ్స్‌లో 259 మైనింగ్ సిర్దార్‌, స‌ర్వేయ‌ర్ ఉద్యోగాలు..
Advertisement

NCL Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) అనుబంధ కంపెనీ నార్త‌ర్న్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) మైనింగ్ సిర్దార్ (Mining Sirdar), స‌ర్వేయ‌ర్ (Surveyor) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 259 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల (NCL Recruitment) చేసింది. అర్హ‌త క‌లిగిన వారు ఆగ‌స్టు 5 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆరు నెల‌ల‌పాటు ప్రొబేష‌న్ పీరియ‌డ్ ఉంటుంది. అనంత‌రం రెగ్యులరైజ్ చేస్తారు. ప్రొబేస‌న్ కాలంలో మైనింగ్ సిర్దార్‌కు రూ.47,330, స‌ర్వేయ‌ర్‌కు రూ.51,103 ప్ర‌తినెల చెల్లిస్తారు. ఎంపికైన వారు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సింగ్రౌలి జిల్లా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సోన్‌భ‌ద్రి జిల్లాలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 259
ఇందులో మైనింగ్ సిర్దార్ 254 (జ‌న‌ర‌ల్ 101, ఈడ‌బ్ల్యూఎస్ 25, ఎస్సీ 51, ఎస్టీ 13, ఓబీసీ 64), స‌ర్వేయ‌ర్ 5 (జ‌న‌ర‌ల్ 2, ఎస్టీ 1, ఓబీసీ 2) చొప్పున ఉన్నాయి. వీటితోపాటు బ్యాక్‌లాగ్ పోస్టులు 5 ఉన్నాయి.

అర్హ‌త‌లు:
మైనింగ్ సిర్దార్ పోస్టుల‌కు- మెట్రిక్యులేష‌న్ లేదా త‌త్స‌మాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మైనింగ్‌కు సంబంధించి సిర్దార్ షిప్ స‌ర్టిఫికెట్‌, గ్యాస్ టెస్టింగ్‌, ఫ‌స్ట్ ఎయిడ్ స‌ర్టిఫికెట్ చెల్లుబాటులో ఉండాలి. లేదా మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా, చెల్లుబాట‌య్యే ఓవ‌ర్‌మ్యాన్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి.
స‌ర్వేయ‌ర్ పోస్టుల‌కు- మెట్రిక్యూలేష‌న్, మైనింగ్ లేదా మైన్ స‌ర్వేయింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా, చెల్లుబాట‌య్యే స‌ర్వేయ‌ర్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌స్సు- 2026 ఆగ‌స్టు 5 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి.

ఎంపిక విధానం
రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. ప్ర‌శ్న‌ప‌త్రంలో రెండు సెక్ష‌న్‌లు ఉంటాయి. సెక్ష‌న్ ఏలో టెక్నిక‌ల్ నాలెడ్జ్‌కు సంబంధించి 70 ప్ర‌శ్న‌లు అడుగుతారు. సెక్ష‌న్ బీలో జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, రీజ‌నింగ్‌, వెర్బ‌ల్ అండ్ మెంట‌ల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 1 మార్కు కేటాయించారు. జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఓబీసీ అభ్య‌ర్థులు క‌నీసం 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

అప్లికేష‌న్ ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూలై 14
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 5
వెబ్‌సైట్‌: www.nclcil.in

Advertisement
Advertisement