త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Defence | దేశ‌ ర‌క్ష‌ణకు అత్యంత ప్రాధాన్య‌త‌.. డిఫెన్స్‌కు బ‌డ్జెట్‌లో రూ.7.8 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు

Defence | 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌లో ర‌క్ష‌ణ (defence) రంగానికి మోదీ ప్ర‌భుత్వం పెద్ద పీట వేసింది. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ప్ర‌క‌టించిన తొలి బ‌డ్జెట్‌లో ర‌క్ష‌ణ రంగానికి భారీగా నిధులు పెంచింది.

D

National | Published On Feb 1, 2026, 3.20 pm IST

Defence | దేశ‌ ర‌క్ష‌ణకు అత్యంత ప్రాధాన్య‌త‌.. డిఫెన్స్‌కు బ‌డ్జెట్‌లో రూ.7.8 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు
Advertisement

Defence | 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌లో ర‌క్ష‌ణ (defence) రంగానికి మోదీ ప్ర‌భుత్వం పెద్ద పీట వేసింది. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ప్ర‌క‌టించిన తొలి బ‌డ్జెట్‌లో ర‌క్ష‌ణ రంగానికి భారీగా నిధులు పెంచింది. స‌రిహ‌ద్దుల్లో ఎదుర‌వుతున్న స‌వాళ్లు, ఉగ్ర‌వాదం, పాక్‌, చైనా నుంచి వ‌స్తున్న ముప్పు నేప‌థ్యంలో దేశ ర‌క్ష‌ణ‌కు మోదీ ప్ర‌భుత్వం (Modi Government) ప్రాధాన్య‌త‌ను పెంచింది.

ఈ బ‌డ్జెట్‌లో డిఫెన్స్‌కు ఏకంగా రూ.7.8 ల‌క్ష‌ల కోట్లు కేటాయించింది. ఇది గ‌తేడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ‌. అంతేకాదు, ఈ పెరిగిన మొత్తం జీడీపీలో 11 శాతానికి సమానం. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ. 6.81 లక్షల కోట్ల కంటే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. రఫేల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాల కాంట్రాక్టుల వంటి అనేక ప్రధాన ప్రాజెక్టులు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి.

అదేవిధంగా భార‌త సైన్యం ఆధునికీక‌ర‌ణ కోసం రూ.2.19 ల‌క్ష‌ల కేట్లు కేటాయింపు జ‌రిగింది. ఇది గ‌తేడాదితో పోలిస్తే ఏకంగా 21.84 శాతం అధికం. 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణ మంత్రిత్వ శాఖ మూలధన వ్యయం రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో విమానాలు, ఏరో ఇంజన్ల కోసం రూ. 63,733 కోట్లను కేటాయించారు. రక్షణ సేవల రెవెన్యూ ఖర్చులు అంటే రోజూవారీ నిర్వహణ, ఇంధనం, మందుగుండు సామాగ్రి, మరమ్మతులు, సహాయక సిబ్బంది జీతాలు మొదలైన వాటికి 17.24 శాతం నిధుల్ని పెంచారు. పెన్షన్ల కోసం గతేడాది నిధులతో పోలిస్తే 6.53 శాతం పెంచి రూ. 1.71 లక్షల కోట్లకు చేర్చారు.

https://x.com/ANI/status/2017860343985574101/photo/1

Advertisement
Advertisement