త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hotel Check-in | హోట‌ల్స్‌లో ఆధార్ అవ‌స‌రం లేదు.. క్యూఆర్ కోడ్‌, ఓటీపీ చాలు..

Hotel Check-in | తరచూ ప్రయాణాలు చేస్తూ హోటళ్లలో బస చేసే వారికి గుడ్ న్యూస్‌. హోటల్‌లో చెక్‌ఇన్‌ చేసుకునే సమయంలో మొదటగా గుర్తింపు కార్డును అడుగుతారు. చాలా హోటళ్లలో కస్టమర్లు తమ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

S

Business | Published On Aug 27, 2026, 2.17 pm IST

Hotel Check-in | హోట‌ల్స్‌లో ఆధార్ అవ‌స‌రం లేదు.. క్యూఆర్ కోడ్‌, ఓటీపీ చాలు..
Advertisement

Hotel Check-in | తరచూ ప్రయాణాలు చేస్తూ హోటళ్లలో బస చేసే వారికి గుడ్ న్యూస్‌. హోటల్‌లో చెక్‌ఇన్‌ చేసుకునే సమయంలో మొదటగా గుర్తింపు కార్డును అడుగుతారు. చాలా హోటళ్లలో కస్టమర్లు తమ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ప్రయాణికుల వద్ద ఆధార్‌ కాపీ ఉండకపోవడంతో సమీపంలోని దుకాణానికి వెళ్లి కాపీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు హోటల్‌ చెక్‌ఇన్‌ ప్రక్రియను డిజిటలైజ్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం క్యూఆర్‌ కోడ్‌, ఓటీపీ, యాప్‌ ఆధారిత డిజిటల్‌ ధ్రువీకరణ వంటి గుర్తింపు పద్ధతులను అనుమతించనున్నారు. దీంతో భవిష్యత్తులో హోటల్‌ గది బుక్‌ చేసిన ప్రతిసారీ ఆధార్‌ కార్డు ఫొటో లేదా భౌతిక జిరాక్స్‌ కాపీని సమర్పించాల్సిన అవసరం తగ్గనుంది. ఈ విధానం చెక్‌ఇన్‌ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా కస్టమర్ల ఆధార్‌ వివరాలను మరింత సురక్షితంగా ఉంచుతుంది.

క్యూఆర్ కోడ్ లేదా ఓటీపీతో..

కొత్త విధానంలో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ధ్రువీకరణను అమలు చేయనున్నారు. హోటల్‌ చెక్‌ఇన్‌ సమయంలో కస్టమర్లు ఆధార్‌ యాప్‌లో భద్రపరిచిన క్యూఆర్‌ కోడ్‌ను చూపించాల్సి ఉంటుంది. హోటల్‌ సిబ్బంది ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి గుర్తింపును ధ్రువీకరిస్తారు. క్యూఆర్‌ కోడ్‌తో పాటు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కూడా కొత్త విధానంలో భాగం కానుంది. కస్టమర్‌ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ పంపించి గుర్తింపును ధ్రువీకరించే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ఇతర సేవల్లో ఉపయోగిస్తున్న విధానానికి ఇది దగ్గరగా ఉండ‌నుంది. ఆధార్‌ జిరాక్స్‌ కాపీలను సమర్పించడంలో ప్రధాన ఆందోళన వ్యక్తిగత వివరాల భద్రత. కాగితంపై ఉండే ఆధార్‌ కాపీలో పేరు, చిరునామా, ఇతర గుర్తింపు వివరాలు ఉంటాయి. ఒక సంస్థ ఆ కాపీని ఎక్కువ కాలం తన వద్ద ఉంచితే వ్యక్తిగత డేటా గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంటుంది. డిజిటల్‌ ధ్రువీకరణ ద్వారా ఇలాంటి సమాచారాన్ని భౌతికంగా నిర్వహించాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు.

ఈ మార్పుతో హోటల్‌ చెక్‌ఇన్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. గుర్తింపు ధ్రువీకరణకు పట్టే సమయం తగ్గే అవకాశం ఉంది. ఆధార్‌ జిరాక్స్‌ కాపీలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. కాగిత వినియోగం కూడా తగ్గుతుంది. అదే సమయంలో వ్యక్తిగత సమాచార భద్రతను మెరుగుపరచడంలో ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement