Punjab Elections 2027 | పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీ జోడీ?
Punjab Elections 2027 | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను గద్దె దించేందుకు కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఏడీ) వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో గతంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-అకాలీ దళ్ మళ్లీ జట్టుకట్టనున్నాయన్న చర్చ తెరపైకి వచ్చింది.
- వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
- 21 సీట్లలో ఓట్ల లెక్క మారే అవకాశం
- 2020లో ఎన్డీఏను వీడిన ఎస్ఏడీ
- మళ్లీ రెండు పార్టీలు కలుస్తాయా?
Punjab Elections 2027 | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను గద్దె దించేందుకు కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఏడీ) వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో గతంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-అకాలీ దళ్ మళ్లీ జట్టుకట్టనున్నాయన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఇటీవల పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో రెండు పార్టీల మధ్య తెరవెనుక చర్చలు కొనసాగుతున్నాయన్న కథనాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
2024 ఓట్ల లెక్క ఏం చెబుతోంది?
2024 లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీజేపీ, అకాలీ దళ్ సాధించిన ఓట్లను కలిపి చూస్తే.. దాదాపు 21 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఆప్ కంటే ఈ రెండు పార్టీల ఓటుబలం ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది కేవలం గత ఎన్నికల గణాంకాల ఆధారంగా వేసిన అంచనా మాత్రమే. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధంగా ఓట్లు బదిలీ అవుతాయన్నది లేదు. 2024లో బీజేపీ 23 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక ఓట్లు సాధించింది. అకాలీ దళ్ తొమ్మిది చోట్ల ఆధిక్యంలో నిలిచింది. అంటే విడివిడిగా పోటీ చేసినప్పటికీ రెండు పార్టీలు కలిపి 32 నియోజకవర్గాల్లో పైచేయి సాధించాయి. వాటి ఓట్లను కలిపితే మరికొన్ని స్థానాల్లోనూ పోటీ లెక్కలు మారే అవకాశం కనిపిస్తోంది.
పట్టణంలో బీజేపీ.. గ్రామీణంలో అకాలీ..
పంజాబ్‌లో బీజేపీకి పట్టణ, వ్యాపార వర్గాల్లో కొంత బలమైన మద్దతు ఉంది. అకాలీ దళ్‌కు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మాల్వా, పంథక్ ప్రాంతాల్లో సంప్రదాయ పట్టు ఉంది. ఈ రెండు వర్గాల ఓటుబ్యాంకులు ఒకే వేదికపైకి వస్తే కాంగ్రెస్, ఆప్‌లకు పలు చోట్ల గట్టి పోటీ తప్పకపోవచ్చన్నది గణాంకాల ఆధారంగా వినిపిస్తున్న అంచనా. ఖరార్‌లో బీజేపీ, అకాలీ దళ్ ఓట్లు కలిపితే 58,045. కాంగ్రెస్ సాధించిన 46,622 ఓట్లతో పోలిస్తే 11,423 అధికం. మాన్సాలో రెండు పార్టీలకు కలిపి 57,918 ఓట్లు రాగా.. ఆప్ 48,008 ఓట్లు సాధించింది. ఇక్కడ తేడా 9,910. సమానాలో బీజేపీ-అకాలీ ఓట్లు 44,258 కాగా.. ఆప్‌కు 36,141 వచ్చాయి. ఆధిక్యం 8,117 ఓట్లు. పాటియాలా రూరల్‌లో కూటమి లెక్క 45,502 ఓట్లు. ఆప్ 37,446 ఓట్లతో వెనుకబడింది. మౌర్‌లో బీజేపీ-అకాలీ దళ్ కలిపి 43,237 ఓట్లు సాధించగా.. ఆప్‌కు 35,211 వచ్చాయి. అమృత్‌సర్ వెస్ట్‌లో రెండు పార్టీల ఓట్లు 42,388 కాగా.. కాంగ్రెస్ 35,012 వద్ద ఆగింది. ఫగ్వారాలో కూటమి ఓట్లు 37,000 కాగా.. ఆప్‌కు 30,349 వచ్చాయి.
లెక్కలు వేరు.. ఎన్నికల ఫలితం వేరు
అట్టారీలో బీజేపీ-అకాలీ దళ్ కలిపి 37,897 ఓట్లు సాధించినట్లవుతుంది. కాంగ్రెస్ ఓట్లు 32,479. నాభాలో కూటమి లెక్క 40,543 కాగా.. కాంగ్రెస్ 36,230తో వెనుక ఉంది. సహ్‌నేవాల్‌లో రెండు పార్టీల ఓట్లు 60,797కు చేరగా.. కాంగ్రెస్ 55,541 సాధించింది. శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ పరిధిలోని బాలాచౌర్‌లోనూ బీజేపీ-అకాలీ దళ్ ఓట్ల కలయిక కాంగ్రెస్ కంటే ముందుంటుంది. ఇక్కడ రెండు పార్టీలకు కలిపి 29,472 ఓట్లు ఉండగా.. కాంగ్రెస్‌కు 22,684 వచ్చాయి. మజ్హా ప్రాంతంలోని దీనానగర్‌లో మాత్రం పోటీ హోరాహోరీగా ఉంది. బీజేపీ-అకాలీ ఓట్లు కలిపితే 45,919.. కాంగ్రెస్‌కు 45,319. తేడా కేవలం 600 ఓట్లు. మాల్వా ప్రాంతంలోని బఠిండా సిటీ, లంబీ, భుచో మండీ, బఠిండా రూరల్, బుధ్లాడా నియోజకవర్గాల్లోనూ రెండు పార్టీల ఓట్ల కలయిక కీలకంగా మారే అవకాశముంది. అయితే, లోక్‌సభ ఎన్నికల ఓట్లను నేరుగా అసెంబ్లీ ఎన్నికలకు అన్వయించడం సరికాదు. కూటమి ఏర్పడితే రెండు పార్టీల ఓటర్లు పూర్తిగా ఒకే అభ్యర్థి వైపు మళ్లుతారా? అన్నది కీలకం. స్థానిక నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల వారీ సమీకరణాలు ఫలితాలను ప్రభావితం చేయొచ్చు. రైతు సమస్యలు, నిరుద్యోగం, పట్టణాభివృద్ధి, మతపరమైన అంశాలు, అధికార వ్యతిరేకత కూడా ఎన్నికల సమయంలో కీలకంగా మారే అవకాశం ఉంది.
2020లో తెగిన బంధం
బీజేపీ-అకాలీ దళ్ మధ్య దశాబ్దాలుగా కొనసాగిన రాజకీయ బంధానికి 2020 సెప్టెంబరు 26న తెరపడింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ రక్షణ కల్పించాలన్న డిమాండ్‌తో పాటు పంజాబ్, రైతులు, సిక్కుల అంశాల్లో కేంద్రం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్డీయే నుంచి వైదొలిగింది. ఇప్పుడు మళ్లీ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు తెరపైకి రావడం పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. అయితే బీజేపీ బహిరంగంగా ఒంటరి పోరుకే సిద్ధమని చెబుతున్న నేపథ్యంలో.. చివరకు పాత మిత్రులు మళ్లీ ఒక్కటవుతారా? లేక ఎవరి దారిలో వారు సాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్డేట్
- ●Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..
- ●Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్
- ●Harish Rao Arrest | హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్డేట్

Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..

Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్

Harish Rao Arrest | హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత






