Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్
Rashi Singh | తెలుగు చిత్రపరిశ్రమ తనను సొంత అమ్మాయిలా ఆదరించిందని నటి రాశి సింగ్ తెలిపింది. హైదరాబాద్ నగరం, తెలుగు సినీ పరిశ్రమ తనకు ఎంతో ఆప్యాయతను పంచాయని, అందుకే పూర్తిగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయి తెలుగు అమ్మాయిలా మారిపోయానని తెలిపింది.
Entertainment | Published On Aug 27, 2026, 2.15 pm IST
Rashi Singh | తెలుగు చిత్రపరిశ్రమ తనను సొంత అమ్మాయిలా ఆదరించిందని నటి రాశి సింగ్ తెలిపింది. హైదరాబాద్ నగరం, తెలుగు సినీ పరిశ్రమ తనకు ఎంతో ఆప్యాయతను పంచాయని, అందుకే పూర్తిగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయి తెలుగు అమ్మాయిలా మారిపోయానని తెలిపింది. అల్లరి నరేశ్ హీరోగా కథానాయకుడిగా, విష్ణుప్రియా, రాశి సింగ్, ప్రిషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి సింగ్ తన సినీ ప్రయాణం, చిత్ర విశేషాలు, సినిమా రంగంలోని సవాళ్లు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై స్పందించింది.
సినీ ప్రయాణం రోలర్‌కోస్టర్ రైడ్..
తన సినీ ప్రయాణం రోలర్‌కోస్టర్ రైడ్‌లా సాగుతోందని రాశి సింగ్ తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పింది ఛత్తీస్‌గఢ్ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీపై తనకు మొదటి నుంచీ ఎంతో ప్రేమ ఉందని, ఇక్కడి ప్రేక్షకులు, పరిశ్రమ తనను ఎంతో ఆప్యాయంగా ఆదరించారని పేర్కొంది. హైదరాబాద్ తనకు ఎంతో దగ్గరైన నగరంగా మారిపోయిందని, ఇక్కడే స్థిరపడుతూ తెలుగు అమ్మాయిలా మారిపోయానని రాశి సింగ్ చెప్పుకొచ్చింది. ‘రంభ ఊర్వశి మేనక’కు ముందు ఇదే నిర్మాణ సంస్థలో ఓ చిత్రంలో నటించే అవకాశం తనకు వచ్చిందని రాశి సింగ్ వెల్లడించింది. అయితే, ఆరోగ్య కారణాల వల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయానని తెలిపింది. ఆ తర్వాత ‘రంభ ఊర్వశి మేనక’ కథను వినిపించగా.. కథ, తన పాత్ర బాగా నచ్చాయని చెప్పింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని భావించి వెంటనే సినిమాకు అంగీకరించినట్లు పేర్కొంది.
టైటిల్‌లోనే పాత్రల పేర్లు..
ఓ నటిగా సినిమా టైటిల్‌లోనే తమ పాత్రల పేర్లు ఉండటం చాలా ప్రత్యేకమైన విషయమని రాశి సింగ్ చెప్పింది. ‘రంభ ఊర్వశి మేనక’లో తమ పాత్రలకు అంతటి ప్రాధాన్యం ఉండటం సంతోషంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్, హీరో అల్లరి నరేశ్, నిర్మాత రాజేశ్ దండా కలయికలో పనిచేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు సినిమాను ఎంతో స్పష్టతతో తెరకెక్కించారు. కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు’ అంటూ ప్రశంసలు కురిపించింది రాశి. నటనతో పాటు తాను వ్యాపార రంగంలోనూ కొనసాగుతున్న విషయంపై స్పందించింది. ‘వ్యాపారంలో 100 శాతం కష్టపడితే అందుకు తగిన ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది. సినిమా రంగం పూర్తిగా భిన్నంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఒక సినిమా కోసం దర్శకుడు, నటీనటులు, నిర్మాతలు సహా ప్రతి ఒక్కరూ 100 శాతం కష్టపడినా.. సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదని.. ప్రేక్షకుల స్పందన, ఇతర పరిస్థితులు విజయాన్ని నిర్ణయిస్తాయని తెలిపింది. అందుకే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టమని రాశి సింగ్ తెలిపింది.
అసలు పట్టించుకోను..
సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ గురించి తాను ఇప్పుడు అసలు పట్టించుకోనని రాశి సింగ్ స్పష్టం చేశారు. అయితే పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో, అంతకుముందు స్కూల్ రోజుల్లో ఇతరుల విమర్శలు తనను బాధపెట్టేవని గుర్తుచేసుకుంది. ‘సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన సందేశాలు చూసి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నయ్. కాలక్రమంలో ఆ విమర్శలను ఎలా చూడాలో అర్థమైంది. ఇతరులు చేసే అసభ్యకర వ్యాఖ్యలు నా తప్పు కాదు. అది వారి ఆలోచనా విధానం. మానసిక సమస్యకు సంబంధించిన విషయమని గ్రహించాను. ఇప్పుడు అలాంటి నెగెటివిటీకి పూర్తిగా దూరంగా ఉంటున్నాను. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లను పట్టించుకోవడం లేదు. కేవలం పని, కెరీర్‌పై మాత్రమే దృష్టి పెడుతున్న’ అని రాశి సింగ్ వివరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ – టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!
ఆగస్టు 27, 2026

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 25, 2026

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ – అధ్యక్ష పదవికి పోటీ
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
- ●Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి
- ●Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
- ●Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి

PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ

Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి



