NEET UG | 10 లక్షలకు కొని, 15 లక్షలకు అమ్మాడు.. నీట్ పేపర్ లీక్ కేసులో విద్యార్థి అరెస్ట్
NEET UG | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2026-నీట్ యూజీ (NEET UG) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో (Paper Leak) పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పేపర్ లీక్ కుంభకోణానికి కేంద్ర బిందువుగా ఉన్న గెస్ పేపర్‌ను (Guess Paper) కొనుగోలు చేసిన ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో (Nashik) విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
NEET UG | త్రినేత్ర.న్యూస్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2026-నీట్ యూజీ (NEET UG) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో (Paper Leak) పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పేపర్ లీక్ కుంభకోణానికి కేంద్ర బిందువుగా ఉన్న గెస్ పేపర్‌ను (Guess Paper) కొనుగోలు చేసిన ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో (Nashik) బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని శుభం ఖైర్నార్‌గా (Shubham Khairnar) గుర్తించారు. రాజస్థాన్ పోలీసుల సమాచారం మేరకు నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పేపర్‌కు రూ.15 లక్షలు
ఖైర్నార్ ఒక్క పేపర్‌ను రూ.10 లక్షలు ఇచ్చి పుణెలోని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దానిని హర్యానాకు చెందిన మరో వ్యక్తికి రూ.15 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. కాగా,ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నాసిక్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే నీట్ పేపర్ నాసిక్‌లో ప్రింట్ కాలేదని పోలీసులు వెల్లడించారు.
135 ప్రశ్నలు..
దేశవ్యాప్తంగా ఈ నెల 3న నీట్ యూజీ 2026 పరీఓను నిర్వహించారు. దీనికి సుమారు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష ముగిసిన కొద్ది గంటలకు కొన్న చోట్ల పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరిగింది. పరీక్ష ముగిసిన రెండు రోజులకు రాజస్థాన్‌లోని కోటా, సికార్ ప్రాంతాల్లో ఒక ప్రాక్టీస్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులోని ప్రశ్నలు నీట్ ఎగ్జామ్ పేపర్‌తో సరిపోలడంతో అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంత పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.
కాగా, గెస్ పేపర్‌ను సాధారణంగా కోచింగ్ సెంటర్లు తయారు చేస్తుంటాయి. దీనిని విద్యార్థులకు ప్రాక్టీస్ కోసం గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలతో రూపొందిస్తారు. అయితే గెస్ పేపర్‌లో బయాలజీ నుంచి అడిగిన 90 ప్రశ్నలు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలే నీట్ ఎగ్జామ్‌లో కూడా ఉన్నాయి. మొత్తం 180 ప్రశ్నలకుగాను 135 ప్రశ్నలు గెస్‌పేపర్‌లో ఉన్నాయి.
సంబంధిత వార్తలు

AIAPGET | ఆయుష్ పీజీ అడ్మిషన్స్.. AIAPGET నోటిఫికేషన్ విడుదల
జులై 14, 2026

Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జులై 7, 2026

Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
జులై 7, 2026
తాజావార్తలు
- ●Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..
- ●Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం
- ●Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?
- ●Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు
- ●NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..

Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..

Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?



