త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ – త‌న‌యుడి త్యాగం – ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ మూవీకి పోటీగా అత‌డి కొడుకు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సిగ్మా రిలీజ్ కాబోతుండ‌టం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌న‌నాయ‌గ‌న్ జూలై 24న రిలీజ్ అవుతోండ‌గా...సిగ్మా జూలై 31న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. తండ్రి విజ‌య్‌తో బాక్సాఫీస్ పోటీ నుంచి త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు స‌మాచారం. సిగ్మా పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Jul 14, 2026, 11.34 am IST

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్  ఫైట్ – త‌న‌యుడి త్యాగం – ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?
Advertisement

Jana Nayagan vs Sigma | త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ జూలై 24న థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌నాయ‌గ‌న్ రిలీజైన వారం త‌ర్వాత జూలై 31న ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి మూవీ సిగ్మా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. వారం గ్యాప్‌లో తండ్రీకొడుకుల సినిమాలు రిలీజ్ కానుండ‌టం త‌మిళ‌నాట ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ పోరులో ఎవ‌రూ విన్న‌ర్‌గా నిలుస్తార‌న్న‌ది ఉత్కంఠ‌ను పంచుతోంది.

సిగ్మా  పోస్ట్‌పోన్

తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ విష‌యంలో జాస‌న్ సంజ‌య్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు స‌మాచారం. సిగ్మా మూవీ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు వార్తొల‌స్తున్నాయి. జ‌న‌నాయ‌గ‌న్ హ‌వాను త‌ట్టుకొని సిగ్మా థియేట‌ర్ల‌లో నిల‌వ‌డం క‌ష్ట‌మే. మ‌రోవైపు తొలి సినిమాతోనే తండ్రితో పోటీగా బ‌రిలో దిగ‌డం క‌రెక్ట్ కాద‌ని జాస‌న్ సంజ‌య్ నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు. అందుకే త‌న సినిమాను వాయిదా వేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం సిగ్మా మూవీ విడుద‌ల‌ ఆగ‌స్ట్‌కు వాయిదా ప‌డిన‌ట్లు తెలిసింది. అందుకే ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మేక‌ర్స్ సైలెంట్ అయ్యారు. సిగ్మా పోస్ట్‌పోన్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో రానున్న‌ట్లు చెబుతోన్నారు.

సందీప్ కిష‌న్‌...

సిగ్మా మూవీలో సందీప్ కిష‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కేథ‌రిన్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. జాస‌న్ సంజ‌య్ డైరెక్ష‌న‌ల్ డెబ్యూ మూవీ కావ‌డంతో త‌మిళ‌నాడు ఈ చిన్న సినిమాపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తెలుగులోనూ అదే పేరుతో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

బాక్సాఫీస్ రికార్డులు

మ‌రోవైపు జ‌న‌నాయ‌గ‌న్ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా వాయిదాప‌డింది. దాదాపు ఆరేడు నెల‌ల నిరీక్ష‌ణ త‌ర్వాత ఇటీవ‌లే అడ్డంకులు తొల‌గిపోయాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ గెలిచి సాధించిన సీఎంగా మారిన త‌ర్వాత రిల‌జ్ అవుతోన్న సినిమా కావ‌డంతో జ‌న‌నాయ‌గ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఓపెనింగ్స్ ప‌రంగా గ‌త సినిమాల సినిమాల రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాస్తుంద‌ని అంటున్నారు. జ‌న‌నాయ‌గ‌న్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. మ‌మితా బైజు ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించింది. తెలుగు మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది.

 

Advertisement
Advertisement