Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు
Prashant Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తన ఆస్తుల వివరాల ప్రకటించారు. తన కుటుంబానికి రూ.198 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు (family assets) ప్రకటించారు. అయినప్పటికీ తన వద్ద సొంత కారు లేదని, రూ.5.77 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
Prashant Kishor | త్రినేత్ర.న్యూస్ : ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే బాంకీపూర్ అసెంబ్లీ బై-ఎలక్షన్‌లో (Bankipur Assembly constituency) పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలతో సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన కుటుంబానికి రూ.198 కోట్ల ఆస్తులు ఉన్నట్లు (family assets) ప్రకటించారు.
మొత్తం ఆస్తుల్లో తన పేరిట రూ.96.06 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని పీకే తెలిపారు. తన భార్య డాక్టర్ జాహ్నవి దాస్ పేరున రూ.101.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వివరించారు. కుటుంబానికి చెందిన చరాస్తుల విలువ రూ.111.78 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ.82.29 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వేదాస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తనకు 100 శాతం స్టేక్ ఉందని తెలిపారు. దీని విలువ సుమారు రూ.95.26 కోట్లు అని పీకే ప్రకటించారు.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ల విలువ రూ. 7.36 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. ఇక తన బ్యాంకు ఖాతాలో రూ. 65,570, భార్య ఖాతాలో రూ. 1,95,200 నగదు ఉన్నట్లు చెప్పారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, ఇన్సూరెన్స్ పాలసీల్లో పెట్టుబడులను కూడా అఫిడవిట్‌లో ప్రస్తావించారు. స్థిరాస్తుల్లో బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో రూ. 9.75 కోట్ల విలువైన రైస్ మిల్, పాట్లీపుత్ర కాలనీ, వసంత్ విహార్, ఘాజియాబాద్‌లో రూ. 59.25 కోట్ల విలువైన నివాస గృహాలు ఉన్నట్లు ప్రకటించారు. ఇక చరాస్తుల్లో భాగంగా తమ కుటుంబం వద్ద 475 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. తనకు సుమారు రూ. 5.77 కోట్ల అప్పులు ఉన్నాయని, సొంతంగా ఎలాంటి కారూ లేదని పీకే పేర్కొన్నారు.
తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. పాట్నా, బెట్టియా సహా బీహార్‌లోని వివిధ ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ కేసుల్లో ఎందులోనూ తాను దోషిగా తేలలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కాగా, బాంకీపూర్ నియోజకవర్గంలో జూలై 30న పోలింగ్ జరగనుంది. ఆగస్టు 3న ఫలితం వెలువడనుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబిన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానం ఖాళీ అయింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rain Alert | చల్లని కబురు.. జూలై 16 నుంచి మోస్తరు వర్షాలు
- ●ACB Raids | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంపై ఏసీబీ దాడులు..
- ●Hyderabad | హైదరాబాద్‌లో మరో నాలుగు చెరువుల అభివృద్ధి.. 227 కోట్లతో తొలిదశ పనులు
- ●Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఇబ్బందా.. కేవలం రూ.24 చెల్లిస్తే చాలు, రిటర్న్స్ రెడీ..
- ●Nitin Gadkari | వాహనం మైలేజ్‌ని మనం కచ్చితంగా కొలవలేం : నితిన్ గడ్కరీ
- ●Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..

Rain Alert | చల్లని కబురు.. జూలై 16 నుంచి మోస్తరు వర్షాలు

ACB Raids | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంపై ఏసీబీ దాడులు..

Hyderabad | హైదరాబాద్‌లో మరో నాలుగు చెరువుల అభివృద్ధి.. 227 కోట్లతో తొలిదశ పనులు

Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఇబ్బందా.. కేవలం రూ.24 చెల్లిస్తే చాలు, రిటర్న్స్ రెడీ..






