త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIAPGET | ఆయుష్ పీజీ అడ్మిష‌న్స్‌.. AIAPGET నోటిఫికేషన్‌ విడుదల

AIAPGET | దేశ వ్యాప్తంగా ఆయుష్ కాలేజీలు, సంస్థ‌ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విభాగాల్లో పీజీ (AYUSH PG) కోర్సులు ఎండీ, ఎంఎస్ ప్రవేశాల కోసం నిర్వహించే ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AIAPGET) నోటిఫికేషన్ విడుద‌లైంది.

G

National | Published On Jul 14, 2026, 8.49 am IST

AIAPGET | ఆయుష్ పీజీ అడ్మిష‌న్స్‌.. AIAPGET నోటిఫికేషన్‌ విడుదల
Advertisement

AIAPGET | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ వ్యాప్తంగా ఆయుష్ కాలేజీలు, సంస్థ‌ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విభాగాల్లో పీజీ (AYUSH PG) కోర్సులు ఎండీ, ఎంఎస్ ప్రవేశాల కోసం నిర్వహించే ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AIAPGET) నోటిఫికేషన్ విడుద‌లైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్షలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ ప‌రీక్ష‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ () నిర్వ‌హిస్తున్న‌ది.

ప‌రీక్ష పేరు: ఏఐఏపీజీఈటీ 2026

అర్హ‌త‌: బీఏఎంఎస్ (BAMS), బీయూఎంఎస్ (BUMS), బీఎస్‌ఎంఎస్ (BSMS), బీహెచ్‌ఎంఎస్ (BHMS) లేదా గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా తప్పనిసరిగా ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక‌ విధానం: కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష (CBT) ద్వారా. మొత్తం 120 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు 4 మార్కులు. మొత్తం 480. పరీక్ష‌ను 2 గంట‌ల్లో పూర్తిచేయాలి.

అప్లికేష‌న్ ఫీజు: రూ.2,700, జనరల్–ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులు రూ.2,450, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1800
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ: జూలై 30
దరఖాస్తు సవరణ: ఆగస్టు 1, 2 తేదీల్లో
ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: ఆగస్టు 22
వెబ్‌సైట్‌: https://examinationservices.nic.in/

Advertisement
Advertisement