త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | కేంద్ర మంత్రులు గ‌డ్క‌రీ, రామ్మోహ‌న్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..

Revanth Reddy | ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari), రామ్మోహన్ నాయుడుతో (Ram Mohan Naidu) స‌మావేశ‌మ‌య్యారు. ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి, అధికారుల‌తో క‌లిసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త రహదారి ప్రతిపాదనలు తదితర అంశాలపై మంత్రుల‌తో చర్చించారు.

G

Telangana | Published On Jul 14, 2026, 11.52 am IST

Revanth Reddy | కేంద్ర మంత్రులు గ‌డ్క‌రీ, రామ్మోహ‌న్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari), రామ్మోహన్ నాయుడుతో (Ram Mohan Naidu) స‌మావేశ‌మ‌య్యారు. ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి, అధికారుల‌తో క‌లిసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త రహదారి ప్రతిపాదనలు తదితర అంశాలపై మంత్రుల‌తో చర్చించారు.

కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో రీజిన‌ల్ రింగ్ రోడ్డు (RRR)తోపాటు ప‌లు జాతీయ ర‌హ‌దారుల నిర్మాణాల గురించి ప్ర‌స్తావించారు. ట్రిపుల్ ఆర్ ఉత్త‌ర భాగానికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని వివరించారు. ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని, హైదరాబాద్-అమరావతి మధ్య 12వ వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

విమానాశ్రయాల అభివృద్ధి పనులపై..

అనంత‌రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం సమావేశమయింది. ఈ సంద‌ర్భంగా ఆదిలాబాద్ (Adilabad Airport), వరంగల్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ ప్రాజెక్టులను వేగవంతం చేసి రాష్ట్రంలో ప్రాంతీయ విమాన సేవలను విస్తరించాలని కోరారు.

Advertisement
Advertisement