YouTube Shorts | యూట్యూబ్ షార్ట్స్‌కు భారీ అప్‌డేట్.. రెట్టింపు వేగంతో వీడియోలను చూడవచ్చు..
YouTube Shorts | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన షార్ట్ ఫామ్ వీడియో మాధ్యమం యూట్యూబ్ షార్ట్స్‌కు పలు కీలక అప్‌డేట్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచడం, కంటెంట్ డెలివరీని వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా చూపించడం తదితర మార్పులను కొత్త అప్‌డేట్‌లో అందిస్తోంది.
Technology | Published On Jun 26, 2026, 3.08 pm IST
YouTube Shorts | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన షార్ట్ ఫామ్ వీడియో మాధ్యమం యూట్యూబ్ షార్ట్స్‌కు పలు కీలక అప్‌డేట్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచడం, కంటెంట్ డెలివరీని వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా చూపించడం తదితర మార్పులను కొత్త అప్‌డేట్‌లో అందిస్తోంది. గత 5 ఏళ్లుగా సేకరించిన యూజర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా షార్ట్స్ ప్లేయర్‌లో క్రమంగా ఈ కొత్త అప్‌డేట్స్‌ను అందించనున్నారు. ఇవి విజువల్ క్లట్టర్‌ను తగ్గించడమే కాకుండా, ప్లే బ్యాక్ కంట్రోల్‌ను పెంచుతాయి. ప్లాట్‌ఫామ్ రికమెండేషన్ అల్గారిథమ్స్‌ను రిఫైన్ చేస్తాయి. దీంతో యూజర్లకు వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా షార్ట్ ఫామ్ వీడియోలు కనిపిస్తాయి.
క్లియర్ స్క్రీన్ మోడ్, రెట్టింపు వేగం..
ఇంటర్ ఫేస్ డిస్ట్రాక్షన్స్ ను తగ్గించడానికి యూట్యూబ్ క్లియర్ స్క్రీన్ మోడ్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసినప్పుడు టెక్స్ట్ డిస్క్రిప్షన్స్, ఇంటరాక్షన్ ఐకాన్స్ తో సహా అన్ని ఆన్ స్క్రీన్ ఓవర్ లేస్ ను తాత్కాలికంగా తొలగిస్తుంది. యూఐ ఎలిమెంట్స్ వీడియోలను అడ్డుకోకుండా కంటెంట్ ను చూడటానికి యూజర్‌కు అవకాశం లభిస్తుంది. యూజర్ల అభ్యర్థనల మేరకు యూట్యూబ్ షార్ట్స్ ప్లేయర్‌లో పలు ఫంక్షనల్ టూల్స్‌ను ఇచ్చింది. వీక్షకులు ప్రస్తుతం షార్ట్‌కు చెందిన ప్లే బ్యాక్‌ను డబుల్ చేయవచ్చు. దీంతో వీడియో రెట్టింపు వేగంతో ప్లే అవుతుంది. యూజర్లు షార్ట్ ప్లే అయ్యే స్క్రీన్‌పై టచ్ చేసి వీడియోను పాజ్ చేసి తరువాత డెడికేటెడ్ మ్యూట్ ఐకాన్‌ను ఎంచుకుంటే ఆడియోను సైలెన్స్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ షార్ట్స్ టైమర్ ఫీచర్‌ను కూడా అందించింది. ఇందులో టైమర్‌ను జీరోకు సెట్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీని వల్ల వ్యూయింగ్ సెషన్స్‌పై మరింత కచ్చితమైన నియంత్రణ లభిస్తుంది.
డిస్ లైక్ బటన్ తొలగింపు, బదులుగా ఇవి..
యూజర్లు కంటెంట్‌తో ప్రవర్తించే విధానం, రికమెండేషన్స్ అల్గారిథంపై ఆ ఇంటరాక్షన్స్ చూపించే ప్రభావం వంటి అంశాల్లోనూ యూట్యూబ్ మార్సులు తీసుకొచ్చింది. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కోసం థంబ్స్ అప్ ఐకాన్ స్థానంలో హార్ట్ ఐకాన్‌ను ఉపయోగిస్తారు. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ కోసం డిస్ లైక్ బటన్ స్థానంలో నాట్ ఇంటరెస్టెడ్, డోంట్ రికమెండ్ దిస్ చానల్ తదితర ఆప్షన్లు ఉంటాయి. షార్ట్స్ ప్లేయర్‌లో సంప్రదాయ డిస్ లైక్ బటన్‌ను తొలగిస్తున్నారు. డేటా ప్రకారం డిస్ లైక్ తరచూ అస్పష్టంగా ఉంటోందని, కచ్చితమైన డిస్ లైక్ కారణాన్ని అది వెల్లడించడం లేదని అందువల్లే దాన్ని తొలగిస్తున్నామని యూట్యూబ్ పేర్కొంది. డిస్ లైక్ అంటే, వీక్షకులు ఆ బటన్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు అనే విషయం సరిగ్గా తెలియదని, అందుకు అనేక కారణాలు ఉంటాయని, టెక్నికల్ క్వాలిటీ లేకపోవడం, టాపిక్‌పై ఆసక్తి లేకపోవడం, క్రియేటర్ నచ్చకపోవడం వంటి అనేక అంశాలు డిస్‌లైక్‌కు కారణాలుగా ఉంటాయని, అందువల్ల డిస్‌లైక్ ఎందుకు అనే విషయాన్ని కచ్చితంగా నిర్దారించలేమని యూట్యూబ్ స్పష్టం చేసింది. అందుకనే దాని స్థానంలో ఆయా బటన్‌లను ఇస్తున్నట్లు తెలిపింది. ఇక కమ్యూనిటీ గైడ్ లైన్స్‌ను ఉల్లంఘించే వీడియోలను రిపోర్ట్ చేసే సామర్థ్యం యూజర్లకు ఉంటుందని యూట్యూబ్ తెలిపింది. ఈ అప్‌డేట్లలో కొన్ని ఇప్పటికే అందుబాటులో ఉండగా, వచ్చే వారం లేదా పది రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ను షార్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో అందించనున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
తాజావార్తలు
- ●KBR Park One Way | కేబీఆర్ పార్కు వన్ వే డ్రోన్ విజువల్..
- ●CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
- ●Ethics Committee | ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ
- ●POVA 8 Pro 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే.. అదిరిపోయిన పీవోవీఏ (పోవా) కొత్త స్మార్ట్ ఫోన్
- ●Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?
- ●Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్

KBR Park One Way | కేబీఆర్ పార్కు వన్ వే డ్రోన్ విజువల్..

CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్

Ethics Committee | ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ

POVA 8 Pro 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే.. అదిరిపోయిన పీవోవీఏ (పోవా) కొత్త స్మార్ట్ ఫోన్





