Australia Vs Paraguay | డ్రాతో ప్రీక్వార్టర్స్‌కు ఆస్ట్రేలియా
Australia Vs Paraguay | ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-డీ చివరి లీగ్ మ్యాచ్‌లో పరాగ్వేతో జరిగిన మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 0-0 డ్రా చేసుకుని ప్రీక్వార్టర్స్ అడుగుపెట్టింది. గురువారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో టర్కీ చేతిలో అమెరికా 3-2 తేడాతో ఓటమిపాలైంది.
- పరాగ్వేతో మ్యాచ్ 0-0 తేడాతో డ్రా
- పాయింట్ల పట్టికలో రెండోస్థానం
Australia Vs Paraguay | ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-డీ చివరి లీగ్ మ్యాచ్‌లో పరాగ్వేతో జరిగిన మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 0-0 డ్రా చేసుకుని ప్రీక్వార్టర్స్ అడుగుపెట్టింది. గురువారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో టర్కీ చేతిలో అమెరికా 3-2 తేడాతో ఓటమిపాలైంది. అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే నిలిచింది. ఈ డ్రాతో ప్రపంచకప్‌లో ఏడోసారి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన పరాగ్వే నాకౌట్‌కు చేరుతుందా? లేదా అన్నది ఇతర గ్రూప్‌లోని జట్ల ఆట తీరుపై ఆధారపడి ఉండనున్నది.
ఆస్ట్రేలియా ఆధిపత్యం..
శాంటా క్లారాలో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఫౌల్స్, ఆటంకాలతో సాగిన ఈ పోరులో ఆస్ట్రేలియా ఎక్కువసేపు బంతిని తన ఆధీనంలో ఉంచుకుంది. అయినా గోల్స్ మాత్రం వేయలేకపోయింది. క్రిస్టియన్ వోల్పాటో, జాక్సన్ ఇర్విన్ చేసిన ప్రయత్నాలను పరాగ్వే గోల్‌కీపర్ కార్లోస్ కొరోనెల్ అడ్డుకున్నాడు. చివరి నిమిషాల్లో జోర్డాన్ బోస్ రెండుసార్లు గోల్‌కు చేరువైనా అదృష్టం కలిసిరాలేదు. విజయం సాధిస్తేనే నాకౌట్‌కు చేరే అవకాశం ఉండడంతో పరాగ్వే దూకుడుగా ఆడినా ఫలితం దక్కలేదు. జూలియో ఎన్సిసో చురుగ్గా కదిలినా మిగతా ప్లేయర్స్ నుంచి అతనికి మద్దతు దక్కలేదు. చివరి క్షణాల్లో మారిసియో మగల్హాయెస్ చేసిన షాట్‌ను ఆస్ట్రేలియా గోల్‌కీపర్ సునాయాసంగా నిలువరించడంతో మ్యాచ్ గోల్స్ లేకుండానే ముగిసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Russia-Ukraine War | రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్
- ●Japan Vs Sweden | డ్రాగా ముగిసినా.. నాకౌట్‌కు జపాన్, స్వీడన్
- ●Mango | మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా? న్యూట్రిషనిస్టులు చెప్పిన నిజం..
- ●CS Sanjay Jaju | కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
- ●WhatsApp | తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్‌కు చెక్.. ఈ సింపుల్ సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు..
- ●IAS Officers Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

Russia-Ukraine War | రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్

Japan Vs Sweden | డ్రాగా ముగిసినా.. నాకౌట్‌కు జపాన్, స్వీడన్

Mango | మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా? న్యూట్రిషనిస్టులు చెప్పిన నిజం..

CS Sanjay Jaju | కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్




