త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nabha Natesh | అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఐటెంగ‌ర్ల్ – మాస్ మ‌హారాజా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ

డిస్కో రాజా త‌ర్వాత ర‌వితేజ, న‌భాన‌టేష్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోయింది. హీరోయిన్‌గా కాకుండా మాస్ మ‌హారాజా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుంది. ఆ సినిమా ఏదంటే?

N

Entertainment | Published On Jun 26, 2026, 2.53 pm IST

Nabha Natesh |  అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఐటెంగ‌ర్ల్ – మాస్ మ‌హారాజా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ
Advertisement

Nabha Natesh | ఓ యాక్సిడెంట్ కార‌ణంగా తెలుగు సినిమాల‌కు మూడేళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన న‌భాన‌టేష్ మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డుతోంది. ఒక్కో ఆఫ‌ర్ అందుకుంటూ సినిమాల స్పీడు పెంచుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో నాగ‌బంధంతో పాటు నిఖిల్ స్వ‌యంభూ సినిమాలు చేస్తోంది. నాగబంధం మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోండ‌గా...స్వ‌యంభూ హిస్టారిక‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ రెండు సినిమాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతుంది న‌భా న‌టేష్‌. నాగ‌బంధం, స్వ‌యంభూ సినిమాల‌పై బోలెడు ఆశ‌లు పెట్టుకుంది న‌భాన‌టేష్‌.

స్పెష‌ల్ సాంగ్‌...

తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ తెలుగులో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంది. మ‌హా మ‌హారాజా ర‌వితేజ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. అయితే హీరోయిన్‌గా కాదు. స్పెష‌ల్ సాంగ్‌లో న‌భాన‌టేష్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌వితేజ హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఇరుముడి ఆగ‌స్ట్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇరుముడి మూవీలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ట‌. ఈ పాటలో ర‌వితేజ‌తో క‌లిసి న‌భాన‌టేష్ స్టెప్పులేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ క‌న్న‌డ బ్యూటీ కంటే ముందు ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం కొంద‌రు బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది హీరోయిన్ల పేర్ల‌ను ప‌రిశీలించార‌ట మేక‌ర్స్‌. చివ‌ర‌కు న‌భాన‌టేష్‌ను ఫైన‌ల్ చేశార‌ట‌ ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం హైద‌రాబాద్‌లో ఓ గ్రాండ్ సెట్‌ను వేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ర‌వితేజ‌, న‌భాన‌టేష్‌పై గ్రాండియ‌ర్‌గా ఐటెంసాంగ్‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

డిస్కో రాజా...

గ‌తంలో ర‌వితేజ హీరోగా న‌టించిన డిస్కో రాజా సినిమాలో న‌భాన‌టేష్ హీరోయిన్‌గా న‌టించింది. అప్పుడు క‌థానాయిక‌గా క‌నిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ర‌వితేజ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇరుముడి మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

 

Advertisement
Advertisement