త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | ఆర్మీతో చేతులు కలిపిన ఎయిర్‌టెల్.. అరుణాచల్ ప‌ర్వ‌తాల్లోనూ ఇక నెట్‌వర్క్ ..

Airtel | దేశంలోని అత్యంత దుర్భేధ్య ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని విస్తరించేందుకు భార‌తి ఎయిర్‌టెల్ కీలక ముందడుగు వేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్ట్ తొలి దశను విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ ప్రకటించింది.

S

Business | Published On Jun 17, 2026, 2.29 pm IST

Airtel | ఆర్మీతో చేతులు కలిపిన ఎయిర్‌టెల్.. అరుణాచల్ ప‌ర్వ‌తాల్లోనూ ఇక నెట్‌వర్క్ ..
Advertisement

Airtel | దేశంలోని అత్యంత దుర్భేధ్య ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని విస్తరించేందుకు భార‌తి ఎయిర్‌టెల్ కీలక ముందడుగు వేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్ట్ తొలి దశను విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను భారత సైన్యంలోని 4 కార్ప్స్ సహకారంతో అమలు చేశారు. ఈ కార్ప్స్ ప్రధాన కార్యాలయం తేజ్‌పూర్‌లో ఉంది. ఈ అమలు ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాలు, అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలు, ఇప్పటివరకు చేరుకోవడం కష్టమైన సరిహద్దు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ మొబైల్ కనెక్టివిటీని మెరుగు ప‌రిచింది. ఈ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బందితోపాటు స్థానిక ప్రజలకు కూడా నమ్మకమైన వాయిస్, డేటా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

30 ఆర్మీ స్టేష‌న్ల‌లో మౌలిక వ‌స‌తులు..

ప్రాజెక్ట్ తొలి దశలో భాగంగా, ఎయిర్‌టెల్ క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ఉన్న 30 ఆర్మీ స్టేషన్లలో టెలికాం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లో తీవ్ర భౌగోళిక, ర‌వాణా పరమైన సవాళ్ల కారణంగా టెలికమ్యూనికేషన్ సేవల విస్తరణ గతంలో పరిమితంగానే ఉండేది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంలో ఎయిర్‌టెల్, భారత సైన్యం మధ్య సమన్వయం కీలక పాత్ర పోషించింది. అనేక ప్రాంతాల్లో సాధారణ రహదారి సౌకర్యం లేకపోవడంతో, భారత సైన్యం ప్రత్యేక లాజిస్టిక్ మద్దతును అందించింది. ఇందులో ఎయిర్‌టెల్ సాంకేతిక బృందాలు, ప్రత్యేక టెలికమ్యూనికేషన్ పరికరాలను లోతైన పర్వత ప్రాంతాలకు తరలించడం, ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ఏర్పాటు పనుల్లో సహకరించడం, అలాగే అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం త‌దిత‌ర‌ అంశాలు ఉన్నాయి. తొలి దశ పూర్తికావడంతో, ఎయిర్‌టెల్, భారత సైన్యం ఈ ప్రాజెక్ట్ రెండో దశను కూడా ప్రారంభించేందుకు అంగీకరించాయి. రెండో దశలో అరుణాచల్ ప్రదేశ్‌లో మరో 15 ప్రాంతాలకు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను విస్తరించనున్నారు. దీంతో రాష్ట్రంలోని అత్యంత ఒంటరి, కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగుపడనున్నాయి.

మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రిస్తాం..

ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ నార్త్ ఈస్ట్, అస్సాం సీఈఓ బాలాజీ మాట్లాడుతూ దేశంలోని అత్యంత క్లిష్ట భూభాగాల్లో కూడా కనెక్టివిటీని అందించాలనే ఎయిర్‌టెల్ నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనమని తెలిపారు. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ సవాళ్లను అధిగమించేందుకు ఎయిర్‌టెల్ బృందాలు, స్థానిక సహాయక యూనిట్లు విస్తృత స్థాయిలో సమన్వయం చేసుకున్నాయని చెప్పారు. అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తమ బృందాలు కష్టపడి పనిచేసి నెట్‌వర్క్‌ను సమయానికి ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన భారత సైన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement