త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Software Engineer | నీటి గుంత‌లో మునిగిన‌ కారు.. స‌హాయం కోసం టెకీ ఆర్త‌నాదాలు.. ఫోన్ల‌లో వీడియోలు తీసుకున్న జ‌నం

Software Engineer | ఓ కారు అదుపుత‌ప్పి నీటి గుంత‌లో (Water-filled Pit) ప‌డింది. క్ర‌మంగా కారు మునిగిపోతున్న‌ది. కారులో ఉన్న వ్య‌క్తి స‌హాయం కోసం కేక‌లు వేస్తున్నాడు. అక్క‌డ గుమికూడిన జ‌నం తాపీగా త‌మ ఫోన్ల‌లో వీడియోలు (Videos) తీస్తూ ఉండిపోయారు.

G

National | Published On Jan 19, 2026, 6.52 am IST

Software Engineer | నీటి గుంత‌లో మునిగిన‌ కారు.. స‌హాయం కోసం టెకీ ఆర్త‌నాదాలు.. ఫోన్ల‌లో వీడియోలు తీసుకున్న జ‌నం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఓ కారు అదుపుత‌ప్పి నీటి గుంత‌లో (Water-filled Pit) ప‌డింది. క్ర‌మంగా కారు మునిగిపోతున్న‌ది. కారులో ఉన్న వ్య‌క్తి స‌హాయం కోసం కేక‌లు వేస్తున్నాడు. అక్క‌డ గుమికూడిన జ‌నం తాపీగా త‌మ ఫోన్ల‌లో వీడియోలు (Videos) తీస్తూ ఉండిపోయారు. సుమారు రెండు గంట‌ల పాటు మృత్యువుతో పోరాడిన ఆ వ్య‌క్తి.. నీట మునిగి ప్రాణాలు వ‌దిలాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలోని గ్రేట‌ర్ నోయిడాలో (Greater Noida) జ‌రిగింది.

యువ‌రాజ్ మెహ‌తా (27) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) కారులో వెళ్తున్నాడు. అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో గ్రేట‌ర్ నోయిడాలోని సెక్ట‌ర్ 150 వ‌ద్ద అదుపు త‌ప్పిన కారు నీటితో ఉన్న గుంత‌లో ప‌డిపోయింది. డోర్లు లాక‌వ‌డంతో బ‌య‌ట‌కు రాలేక‌పోయిన అత‌డు.. త‌న తండ్రి రాజ్‌కుమార్ మెహ‌తాకు ఫోన్ చేశారు. త‌న‌ను కాపాడాలంటూ వేడుకున్నాడు. లొకేష‌న్ కూడా పంపించారు. దీంతో రాజ్‌కుమార్ పోలీసులకు స‌మాచారం అందించారు. సుమారు రెండు గంట‌ల పాటు తండ్రితో అలాగే మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయ‌న ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకునేలోపు కారు స‌గానికిపైగా మునిగిపోయింది. అప్ప‌టికే అక్క‌డ జ‌నం గుమికూడారు.

యువ్‌రాజ్ హెల్ప్ హెల్ప్ అంటూ కేక‌లు వేస్తూనే ఉన్నాడు. అయినా జ‌నాలు చూస్తూ ఉన్నారే త‌ప్ప ఎవ‌రూ స‌హాయం చేయ‌లేదు. అత‌డిని ర‌క్షించడంలో అధికారులు కూడా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో అత‌డు నీట‌మునిగి చ‌నిపోయాడు. అయితే ఓవైపు అత‌డు స‌హాయం కోసం వేడుకుంటుండ‌గా.. అక్క‌డున్న జ‌నం కారులో నీటిలో మునిగిపోవ‌డాన్ని త‌మ ఫోన్ల‌లో వీడియోలు తీసుకున్నారు. స‌మ‌యానికి స‌రైన స‌హాయం అందితే త‌న కుమారుడు బ‌తికేవాడ‌ని తండ్రి రాజ్‌కుమార్ రోధించారు. రెండు గంట‌ల పాటు త‌న కొడుకు ప్రాణాల కోసం పోరాడాడ‌ని, అంతా అక్క‌డే ఉన్న‌ప్ప‌టికీ అత‌డిని ర‌క్షించలేక‌పోయారని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement