త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Noodles | రాత్రి నూడుల్స్ తిన్నారు.. పొద్దున ప్రాణాలు విడిచారు

Noodles | ఇది విషాద ఘ‌ట‌న‌.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రాత్రి న్యూడుల్స్( Noodles )తిన్నారు. ఇక అంద‌రూ క‌లిసి నిద్ర‌లోకి జారుకున్నారు. తెల్లారేస‌రికి అనుమానాస్ప‌ద‌స్థితిలో కుటుంబ స‌భ్యులంద‌రూ చ‌నిపోయారు.

S

National | Published On Oct 17, 2026, 4.30 pm IST

Noodles | రాత్రి నూడుల్స్ తిన్నారు.. పొద్దున ప్రాణాలు విడిచారు
Advertisement

Noodles | త్రినేత్ర న్యూస్ : ఇది విషాద ఘ‌ట‌న‌.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రాత్రి నూడుల్స్( Noodles )తిన్నారు. ఇక అంద‌రూ క‌లిసి నిద్ర‌లోకి జారుకున్నారు. తెల్లారేస‌రికి అనుమానాస్ప‌ద‌స్థితిలో కుటుంబ స‌భ్యులంద‌రూ చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి స‌మీపంలోని గ్రేట‌ర్ నోయిడాకు చెందిన మ‌హేశ్‌(37), భార్య ల‌లిత‌(35), కుమారులు ల‌డ్డూ(11), సాక్షాత్‌(3), కుమార్తె మిస్తి(7) క‌లిసి నిన్న రాత్రి నూడుల్స్ తిన్నారు. అనంత‌రం టీ కూడా సేవించారు. మ‌హేశ్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిద్ర పోయాడు. తెల్లారేస‌రికి ఐదుగురు కూడా ప్రాణాలు విడిచారు. దీంతో మ‌హేశ్ త‌ల్లి పోలీసుల‌కు స‌మాచారం అందించింది.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే రాత్రి నూడుల్స్ తిని టీ తాగార‌ని, తెల్లారేస‌రికి ప్రాణాలు కోల్పోయార‌ని మ‌హేశ్ త‌ల్లి పోలీసుల‌కు తెలిపింది. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా చ‌నిపోయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని మహేశ్ కుటుంబం తిన్న ఆహార పదార్థాల నమూనాలను తనిఖీ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంత‌రం చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

Advertisement
Advertisement