Coffee | 1/3 కాఫీ ఇవ్వలేదని.. హోటల్‌పైకి బుల్డోజర్‌తో వచ్చిన మున్సిపల్ అధికారి
Coffee | అవినీతి అధికారులు పేట్రేగిపోతున్నారు. అధికారం ఉందికదా అని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. తాము అడిగింది ఇవ్వకపోతే సాధారణ ప్రజలు, చిన్నాచితక వ్యాపారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు.
Coffee | త్రినేత్ర.న్యూస్: అవినీతి అధికారులు పేట్రేగిపోతున్నారు. అధికారం ఉందికదా అని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. తాము అడిగింది ఇవ్వకపోతే సాధారణ ప్రజలు, చిన్నాచితక వ్యాపారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి.. సదరు వ్యాపారి ఇవ్వకపోతే, ఏదోఒక సాకుచూపి ఆయా దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసేయించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, 1/3 కాఫీ (Coffee) ఇవ్వలేదన్న కోపంతో ఓ మున్సిపల్ అధికారి (Municipal Officer) ఏకంగా ఆ హోటల్‌పై బుల్డోజర్‌తో వచ్చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూర్‌లో (Proddatur) జరిగింది.
ప్రొద్దుటూరులోని ప్రధాన కూడలిలో ఉన్న ఓ హోటల్ వద్దకు స్థానిక మున్సిపల్ అధికారి వెళ్లారు. ఒక కాఫీని మూడు భాగాలు చేసి ఇవ్వాలని అడిగాడు. అయితే అలాంటి విధానం తమ హోటల్‌లో లేదని యజమాని సమాధానమిచ్చాడు. దీంతో నాకే కాఫీ ఇవ్వనంటవా అంటూ కోపంతో ఊగిపోయిన ఆ ఆఫీసర్.. 15 నిమిషాల్లోనే ప్రొక్లెయిన్‌ను అక్కడికి తెప్పించాడు.
హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు నిర్మించారని, దానిని తొలగించాలని హంగామా చేశాడు. దీనికి పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంప్‌లున్నాయని, వాటినీ తొలగించాలని యజమాని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. మరింత రెచ్చిపోయిన అధికారి ర్యాంపును తీసెయ్యాలని ప్రొక్లెయిన్ ఆపరేటర్‌ను ఆదేశించాడు. దీంతో హోటల్ యజమాని ప్రొక్లెయిన్‌కు అడ్డంగా పడుకుని దానిని అడ్డుకున్నాడు. తనపైనుంచి పోనిచ్చి ర్యాంప్‌ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశాడు. జనం భారీగా గుమికూడటం, ఈ వ్యవహారాన్నంతా సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండటంతో.. వెనక్కి తగ్గిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
https://x.com/TeluguScribe/status/2019620707899187683
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






