Niranjan Reddy | అప్పుడు మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు పడేది.. రేవంత్ సర్కారేమో పిల్లిమొగ్గలేస్తుంది
Niranjan Reddy | కేసీఆర్ పాలనలో మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు రైతుల ఖాతాల్లో పడిపోయేదని.. ఇప్పుడు రేవంత్ సర్కారేమో పిల్లిమొగ్గలేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొంటిందన్నారు.
- నేరుగా ఖాతాల్లో వేసేందుకు సభలు పెట్టుడెందుకు
- రైతు భరోసా పేరుతో పీఆర్ స్టంట్లు వేస్తున్నరు
- ఎగ్గొట్టినవి ఎప్పుడిస్తారో చెప్పాలి
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శలు
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ పాలనలో మృగశిర కార్తి వచ్చినట్లే రైతుబంధు రైతుల ఖాతాల్లో పడిపోయేదని.. ఇప్పుడు రేవంత్ సర్కారేమో పిల్లిమొగ్గలేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొంటిందన్నారు. అవి ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
ఒక్కసారి రైతుబంధు వేయడం మొదలయితే ఏ రోజు ఏ రైతు ఖాతాలో, ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేది. ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులకు, భూ యజమానులకు రైతుభరోసా, రైతు కూలీలకు రైతుభరోసా అని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతులను దారుణంగా మోసం చేసింది. రైతుభరోసా అమలు విషయంలో రేవంత్ సర్కార్ పిల్లిమొగ్గలు వేస్తుంది అని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
సభల పేరుతో వృథా ఖర్చులు..
ఎకరాకు రూ.15 వేలను రూ.12 వేలకు కుదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారు. ఒకసారి ఊర్ల వారీగా రైతుభరోసా వేశారు. అది గందరగోళంగా మారడంతో మళ్లీ ఎకరాల వారీగా వేశారు. దాన్ని మధ్యలోనే ఆపేశారు. గత యాసంగిలో అందరు రైతులకు అని చెప్పి రెండెకరాల వరకు వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రైతు భరోసా అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి సభల పేరుతో వృథా ఖర్చులు ఎందుకు? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
కాంగ్రెస్‌వి పీఆర్ స్టంట్లు..
పంటల కొనుగోళ్ల విషయంలోనూ ఈ సర్కారు చేతులెత్తేసింది. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటాం అని చెప్పి బాధ్యతల నుండి తప్పుకుంది. యూరియా యాప్ రైతులకు శాపంగా మారింది. ఈ వైఫల్యాల నుండి రైతాంగం దృష్టిని మరల్చడానికి రైతుభరోసా పేరుతో కాంగ్రెస్ పీఆర్ స్టంట్లు చేస్తుంది. రైతులందరికీ రైతుభరోసా వేయాలి. గతంలో ఎగ్గొట్టిన రైతుభరోసా నిధులు విడుదల చేయాలి అని నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sunil Mittal, Revanth Reddy | ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌గా హైదరాబాద్
- ●Bhagyashri Borse | లెనిన్ కోసం భాగ్యశ్రీ బోర్సే రెమ్యూనరేషన్ - మరీ అంత తక్కువా!
- ●Divya Suresh | ప్రముఖ నటికి వేధింపులు.. నడిరోడ్డుపై అసభ్యకరంగా తాకుతూ
- ●Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్ఫుల్ డిస్ప్లే..
- ●CM Revanth Reddy | మార్కెట్ రేటు ప్రకారమే యాదగిరిగుట్ట భూముల కేటాయింపు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Ntr | మురుగన్ తమిళ దేవుడు - పురాణాలను వక్రీకరించొద్దు - ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై తమిళ తంబీల ఫైర్

Sunil Mittal, Revanth Reddy | ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌గా హైదరాబాద్

Bhagyashri Borse | లెనిన్ కోసం భాగ్యశ్రీ బోర్సే రెమ్యూనరేషన్ - మరీ అంత తక్కువా!

Divya Suresh | ప్రముఖ నటికి వేధింపులు.. నడిరోడ్డుపై అసభ్యకరంగా తాకుతూ

Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్ఫుల్ డిస్ప్లే..




