త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SpiceJet Flight | టేకాఫ్ అయిన కాసేప‌టికే ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ఢిల్లీకి తిరిగొచ్చిన బోయింగ్ విమానం

SpiceJet Flight | బోయింగ్ విమానాల్లో (Boeing 737 aircraft) సాంకేతిక స‌మ‌స్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా మ‌రో ప్లేన్‌లో టెక్నిక‌ల్ స‌మ‌స్య (Engine Scare) వ‌చ్చింది.

D

National | Published On Feb 24, 2026, 10.54 am IST

SpiceJet Flight | టేకాఫ్ అయిన కాసేప‌టికే ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ఢిల్లీకి తిరిగొచ్చిన బోయింగ్ విమానం
Advertisement

SpiceJet Flight | బోయింగ్ విమానాల్లో (Boeing aircraft) సాంకేతిక స‌మ‌స్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా మ‌రో ప్లేన్‌లో టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌చ్చింది. స్పైస్‌జెట్‌కు (SpiceJet Flight) చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ (Boeing 737 aircraft) ఇవాళ ఉద‌యం ఢిల్లీ (Delhi) ఎయిర్‌పోర్టు నుంచి ల‌ఢ‌ఖ్ రాజ‌ధాని లెహ్‌కు బ‌య‌ల్దేరింది (Leh Bound SpiceJet Flight). అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేప‌టికే ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య (Engine Scare) త‌లెత్తింది.

ఇంజిన్ నుంచి పొగ‌లు రావ‌డాన్ని గుర్తించిన పైల‌ట్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ విష‌యాన్ని వెంట‌నే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంత‌రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల అనుమ‌తితో విమానాన్ని తిరిగి ఢిల్లీకి మ‌ళ్లించారు. ఆ స‌మ‌యంలో విమానంలో సుమారు 150 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుర‌క్షితంగా ల్యాండ్ అయిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవరికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించారు. ప్ర‌యాణికులంద‌రినీ కింద‌కు దింపి త‌నిఖీలు చేసిన‌ట్లు చెప్పారు. టెక్నిక‌ల్ టీమ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు.

Advertisement
Advertisement