త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bill Gates | ల్యాండింగ్‌కు అనుకూలించ‌ని వాతావ‌ర‌ణం.. గన్నవరంలో గాల్లో చ‌క్క‌ర్లు కొట్టిన బిల్‌గేట్స్‌ విమానం

Bill Gates | గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బిల్‌గేట్స్ (Bill Gates) సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి (Gannavaram Airport) చేరుకున్నారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కురుస్తుండ‌టంతో వాతావ‌ర‌ణం ల్యాడింగ్‌కు అనుకూలించ‌లేదు.

G

National | Published On Feb 16, 2026, 9.07 am IST

Bill Gates | ల్యాండింగ్‌కు అనుకూలించ‌ని వాతావ‌ర‌ణం.. గన్నవరంలో గాల్లో చ‌క్క‌ర్లు కొట్టిన బిల్‌గేట్స్‌ విమానం
Advertisement

Bill Gates | త్రినేత్ర‌.న్యూస్‌: గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బిల్‌గేట్స్ (Bill Gates) సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి (Gannavaram Airport) చేరుకున్నారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కురుస్తుండ‌టంతో వాతావ‌ర‌ణం ల్యాడింగ్‌కు అనుకూలించ‌లేదు. దీంతో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. అనంత‌రం విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌, జిల్లా అధికారులు బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికారు. ఆయన అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. కాగా, ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా గ‌న్న‌వ‌రం నుంచి ప‌లు విమానాలు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి.

స‌చివాల‌యంలోని రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని బిల్‌గేట్స్ సంద‌ర్శించ‌నున్నారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సమావేశమవుతారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై చర్చించ‌నున్నారు.

Advertisement
Advertisement