త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | ఓటు కోల్పోతే.. ఉచితాలు కోల్పోతారు.. SIR నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు డీకే కీల‌క హెచ్చ‌రిక‌లు

DK Shivakumar | ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) కీల‌క సూచ‌న‌లు చేశారు. పౌరులు త‌మ ఓటు హ‌క్కును కోల్పోకుండా చూసుకోవాల‌ని హెచ్చ‌రించారు. ఓటు హక్కును కోల్పోయిన వారు ప్రభుత్వ ప్రయోజనాలను (government benefits) కూడా కోల్పోతారని హెచ్చరించారు.

D

National | Published On Jun 30, 2026, 1.32 pm IST

DK Shivakumar | ఓటు కోల్పోతే.. ఉచితాలు కోల్పోతారు.. SIR నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు డీకే కీల‌క హెచ్చ‌రిక‌లు
Advertisement

DK Shivakumar | క‌ర్ణాట‌క (Karnataka) రాష్ట్రంలో నేటి నుంచి స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ (SIR) ప్రారంభ‌మైంది. జులై 29వ తేదీ వ‌ర‌కు స‌ర్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) కీల‌క సూచ‌న‌లు చేశారు. పౌరులు త‌మ ఓటు హ‌క్కును కోల్పోకుండా చూసుకోవాల‌ని హెచ్చ‌రించారు. ఓటు హక్కును కోల్పోయిన వారు ప్రభుత్వ ప్రయోజనాలను (government benefits) కూడా కోల్పోతారని హెచ్చరించారు. అందుకే ఓట‌ర్ల జాబితాలో త‌మ పేర్లు ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు.

"ఓటు హ‌క్కు అనేది జీవించే హ‌క్కు (right to vote is the right to live). స‌ర్ ఆధారంగా అన‌ర్హులైన ఓట‌ర్ల‌ను రేష‌న్ ల‌బ్ధి నుంచి డిలీట్ చేయాల‌ని ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కార్ ఆదేశించింది. ఇత‌ర రాష్ట్రాలు కూడా ఇలాంటి చ‌ర్య‌లే చేప‌డుతున్నాయి. ఒక‌వేళ మీరు (రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి) ఓటు హ‌క్కును కోల్పోతే.. అప్పుడు ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల‌ను కూడా కోల్పోతారు" అని ఆయన పేర్కొన్నారు. అందుకే ఓట‌ర్ల జాబితాలో త‌మ పేర్లు ఉండేలా చూసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం సూచించారు. స‌ర్ ప్ర‌క్రియ‌లో ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయ‌డానికి త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌త నివాస ధృవీకరణ పత్రాలను (Permanent Residential Certificates) జారీ చేయనున్నట్లు డీకే శివ‌కుమార్‌ ప్రకటించారు. శాశ్వత నివాస ధృవీకరణ పత్రాల జారీపై రెవెన్యూ శాఖ‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ధృవీకరణ ప‌త్రాలు పొంద‌వ‌చ్చని చెప్పారు.

సుమారు 5.5 కోట్ల మంది ఓట‌ర్ల జాబితాను రివిజ‌న్ చేయ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ అన్బుకుమార్ తెలిపారు. స‌ర్ కోసం 59,050 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs), 7,556 మంది బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, 224 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 336 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు శిక్ష‌ణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. అద‌నంగా రాజ‌కీయ పార్టీలు నియ‌మించిన 1.1 ల‌క్ష‌ల మందికిపైగా బూత్ స్థాయి ఏజెంట్ల‌కు కూడా శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement