Nvidia Shares | ఎన్విడియా షేర్లు భారీగా పతనం.. వారంలోనే రూ.47 లక్షల కోట్లు ఆవిరి..
Nvidia Shares | ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా షేర్లు ఒక్క వారంలోనే 13 శాతం పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ నుంచి 573 బిలియన్ డాలర్లు (సుమారు రూ.47 లక్షల కోట్లకు పైగా) ఆవిరయ్యాయి. సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ అధ్యక్షుడు, సీఈఓ, బోర్డు సభ్యత్వ పదవులకు రాజీనామా చేయడం ఈ పరిణామానికి ప్రధాన కారణంగా నిలిచింది.
Nvidia Shares | ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా షేర్లు ఒక్క వారంలోనే 13 శాతం పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ నుంచి 573 బిలియన్ డాలర్లు (సుమారు రూ.47 లక్షల కోట్లకు పైగా) ఆవిరయ్యాయి. సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ అధ్యక్షుడు, సీఈఓ, బోర్డు సభ్యత్వ పదవులకు రాజీనామా చేయడం ఈ పరిణామానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆయన వ్యక్తిగత వివాదాలు, చైనా నిఘా సంస్థతో సంబంధాలపై వచ్చిన ఆరోపణలు కంపెనీపై ఒత్తిడిని పెంచాయి.
చాలా నెలల తరువాత అత్యంత దారుణమైన పతనం..
ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కీలకమైన ఎన్విడియా షేర్లు ఈ వారం భారీగా పతనమయ్యాయి. ఏప్రిల్ 2025 తర్వాత కంపెనీకి ఇదే అత్యంత దారుణమైన వారపు పతనం కావడం గమనార్హం. వరుసగా ఆరో వారం కూడా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. 2012 తర్వాత ఇంత సుదీర్ఘంగా నష్టాలు కొనసాగడం ఇదే తొలిసారి. జెన్సన్ హువాంగ్ రాజీనామా ప్రకటన అనంతరం అమెరికా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో షేర్లు సుమారు 10 శాతం పడిపోయాయి. అంతకుముందు శుక్రవారం షేర్లు 2.01 శాతం నష్టంతో 162.85 డాలర్ల వద్ద ముగిశాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ ఎన్విడియా షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తూ, టార్గెట్ ధరను 400 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించింది. ఒపెన్‌హైమర్ సంస్థ కూడా షేర్ల రేటింగ్‌ను తగ్గించి, గతంలో ప్రకటించిన టార్గెట్ ధరను తొలగించింది.
కొత్త సీఈఓ ఎవరు..?
జెన్సన్ హువాంగ్ రాజీనామా నేపథ్యంలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించారు. ఆమె ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓ బాధ్యతలను కూడా కొనసాగించనున్నారు. శాశ్వత సీఈఓ ఎంపిక కోసం కంపెనీ బోర్డు అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలిస్తోంది. మరోవైపు హార్వే సి. జోన్స్‌ను తొలిసారిగా బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. కొత్త సీఈఓ ఎంపిక కోసం సెర్చ్ సంస్థను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఏ అభ్యర్థితోనూ అధికారికంగా చర్చలు జరపలేదని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
మరో మలుపు తిరిగిన వ్యవహారం..
జెన్సన్ హువాంగ్ వ్యవహారం నవంబర్ 8న మరో మలుపు తిరిగింది. ఆయనను విదేశీ నిఘా సంస్థ లక్ష్యంగా చేసుకుందనే వార్తల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. అయితే జాతీయ భద్రతకు లేదా కంపెనీ రహస్య సమాచారానికి ఎలాంటి ముప్పు వాటిల్లిందని భావించడానికి ఆధారాలు లేవని సంస్థ తెలిపింది. తన భార్యకు ద్రోహం చేశానని, తన చర్యలకు ఎలాంటి సమర్థన లేదని ఉద్యోగులకు పంపిన సందేశంలో హువాంగ్ అంగీకరించారు. సింగపూర్‌కు చెందిన ఎన్విడియా కస్టమర్ సంస్థ మెగాస్పీడ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆలిస్ హువాంగ్ చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ కోసం పనిచేస్తున్నారనే అనుమానాలను న్యూయార్క్ టైమ్స్, ఫైనాన్షియల్ టైమ్స్ కథనాలు ప్రచురించాయి.
నవంబర్ 10న బోర్డు స్వతంత్ర సభ్యులు అమెరికా మాజీ తాత్కాలిక అటార్నీ జూన్ హెచ్. కిమ్, న్యాయ సంస్థ వాచ్టెల్, లిప్టన్, రోసెన్ అండ్ కాట్జ్‌లకు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో మరో వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. అనంతరం హువాంగ్‌ను పదవి నుంచి తొలగించేందుకు బోర్డు సిద్ధమవుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించగా, బుధవారం ఆయన భవిష్యత్తుపై బోర్డు సమావేశమైనట్లు సీఎన్‌బీసీ వెల్లడించింది.
తాజావార్తలు
- ●Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు
- ●Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
- ●Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
- ●Dhanashree Verma | టాలీవుడ్లోకి క్రికెటర్ చాహల్ మాజీ భార్య ఎంట్రీ - విడాకుల తర్వాత హీరోయిన్గా కెమెరా ముందుకు!
- ●MJPTBCWREIS | బీఎస్సీ అగ్రికల్చర్లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈ నెల 16న కౌన్సెలింగ్
- ●Supriya Sule | అజిత్ దాదా మరణించిన రోజే విలీన చర్చలకు ఫుల్స్టాప్ పడింది : సుప్రియా సూలే

Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు

Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి

Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Dhanashree Verma | టాలీవుడ్లోకి క్రికెటర్ చాహల్ మాజీ భార్య ఎంట్రీ - విడాకుల తర్వాత హీరోయిన్గా కెమెరా ముందుకు!






