Gold And Silver Prices Today | బంగారం ధర పైకి, వెండి ధర కిందకి.. బులియన్ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు..
Gold And Silver Prices Today | భౌగోళిక రాజకీయ పరిణామాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ముడి చమురు ధరల్లో అస్థిరత కారణంగా అన్ని మార్కెట్లలోనూ అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలంటే కాస్త వెనుకడుగు వేస్తున్నారు. కాస్త ర్యాలీ రాగానే లాభాల స్వీకరణకు మొగ్గు చూపిస్తున్నారు.
Gold And Silver Prices Today | భౌగోళిక రాజకీయ పరిణామాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ముడి చమురు ధరల్లో అస్థిరత కారణంగా అన్ని మార్కెట్లలోనూ అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలంటే కాస్త వెనుకడుగు వేస్తున్నారు. కాస్త ర్యాలీ రాగానే లాభాల స్వీకరణకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అయితే గరిష్ట స్థాయిల వద్ద ధరలు స్థిరంగా ఉంటే పెట్టుబడుల కోసం చూడవచ్చని, అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా ఉండగా, గత సెషన్‌లో స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరిగి 3,881 డాలర్లకు చేరగా, వెండి ధర 2.58 శాతం పతనమై 48 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 480 పాయింట్లు పెరిగి 1,36,705 వద్ద స్థిరపడగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2415 పాయింట్లు తగ్గి 1,76,309 వద్ద ముగిసింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,762 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,096 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,37,620 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.13,76,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,615 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,00,920గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,26,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,61,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,322 ఉండగా, 8 గ్రాముల ధర రూ.82,576గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,03,220 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,32,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.1,95,000 ఉండగా, తులం ధర రూ.1,950గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.1,95,000 ఉండగా, తులం ధర రూ.1,950 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
నవంబర్ 14, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో లాభాల స్వీకరణ.. అమ్మకాల ఒత్తిడిలో పసిడి, వెండి..
నవంబర్ 13, 2026

Gold And Silver Prices Today | లాభాల స్వీకరణ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.21వేలు తగ్గిన పసిడి ధర..
నవంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!

Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్

Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!



