PFA | పల్స్ ఫీల్డ్ అబ్లేషన్‌తో గుండె దడకు చెక్.. 31, 84 ఏండ్ల బాధిత వ్యక్తులకు చికిత్స విజయవంతం
PFA | మెడ్‌ట్రానిక్ అభివృద్ధి చేసిన పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ (PFA) గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక ముందడుగు వేశామని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్. ఎం.ఎస్. చంద్రమౌళి తెలిపారు. 31, 84 ఏండ్ల వయస్సున్న ఇద్దరికి ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు పేర్కొన్నారు.
- సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్స్‌లో సరికొత్త సాంకేతికత
- విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించిన హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్. ఎం.ఎస్. చంద్రమౌళి
త్రినేత్ర.న్యూస్: మెడ్‌ట్రానిక్ అభివృద్ధి చేసిన పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ (PFA) గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక ముందడుగు వేశామని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్. ఎం.ఎస్. చంద్రమౌళి తెలిపారు. 31, 84 ఏండ్ల వయస్సున్న ఇద్దరికి ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు పేర్కొన్నారు. అత్యంత కచ్చితత్వంతో, సురక్షితంగా ఎట్రియల్ ఫైబ్రిలేషన్ చికిత్స అందించామన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సాంకేతికతను దేశ రోగులకు అందుబాటులోకి తీసుకురావడం యశోద హాస్పిటల్స్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సాంకేతికతతో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

పదేపదే గుండె దడ (Palpitations), ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్న 31 ఏళ్ల యువ రోగిని పరీక్షించగా ఎడమ ఎట్రియల్ టాకీకార్డియాతో కూడిన పారాక్సిస్మల్ ఎట్రియల్ ఫైబ్రిలేషన్ (Paroxysmal Atrial Fibrillation) ఉన్నట్లు తేలింది. దీంతో అత్యాధునిక PFA విధానాన్ని నిర్వహించారు. చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకొని, ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు అని చంద్రమౌళి తెలిపారు.
తీవ్రమైన ఆయాసంతో ఇటీవల 84 ఏళ్ల వృద్ధుడు చేరాడు. పరీక్షించగా ఆయనకు నిరంతర ఎట్రియల్ ఫైబ్రిలేషన్ ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించాం. చికిత్స అనంతరం గుండె రిథమ్ సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశాం అని డాక్టర్ చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజీ బృందంతో భాగమైనట్లు ఆయన వెల్లడించారు.
ఎట్రియల్ ఫైబ్రిలేషన్, ఇతర గుండె రిథమ్ లోపాలకు సంబంధించిన కాంప్లెక్స్ అబ్లేషన్ విధానాలు, పేస్మేకర్ల అమరిక, ICDలు, CRT పరికరాలు, లీడ్లెస్ పేస్మేకర్లు, కండక్షన్ సిస్టమ్ పేసింగ్, హార్ట్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు అందించే నిపుణులు యశోద హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

చుట్టుపక్కల అవయవాలకు హాని లేకుండా..
పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ముఖ్యంగా ఎట్రియల్ ఫైబ్రిలేషన్ (Atrial Fibrillation - AF) గుండె కర్ణికల అసమాన స్పందన వంటి గుండె రిథమ్ లోపాల చికిత్సలో ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక విధానం. ఇది నియంత్రిత విద్యుత్ పల్స్ ద్వారా గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాలను సృష్టించే కణజాలాన్ని లక్ష్యంగా చేసుకొని చికిత్స అందిస్తుంది. సాధారణ థర్మల్ అబ్లేషన్ విధానాలతో పోలిస్తే అన్నవాహిక (Esophagus), ఫ్రెనిక్ నర్వ్ (Phrenic Nerve) వంటి చుట్టుపక్కల ఉండే అవయవాలకు హాని కలగకుండా ఈ చికిత్సను అందించవచ్చు. ఫలితంగా రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవితం గడిపే అవకాశాలు మెండుగా ఉంటాయి అని డాక్టర్ చంద్రమౌళి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్




