త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO | యూఏఎన్ సేవల్లో భారీ మార్పు.. ఇక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో కాదు, ఉమాంగ్ యాప్‌లోనే..

EPFO | భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన అప్‌గ్రేడ్ చేసిన యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను షెడ్యూల్ నిర్వహణ పనులు పూర్తైన తర్వాత మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈసారి సాధారణ వినియోగదారులు కొన్ని కీలక మార్పులను గమనించాల్సి ఉంటుంది.

S

Business | Published On Jul 4, 2026, 4.31 pm IST

EPFO | యూఏఎన్ సేవల్లో భారీ మార్పు.. ఇక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో కాదు, ఉమాంగ్ యాప్‌లోనే..
Advertisement

EPFO | భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన అప్‌గ్రేడ్ చేసిన యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను షెడ్యూల్ నిర్వహణ పనులు పూర్తైన తర్వాత మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈసారి సాధారణ వినియోగదారులు కొన్ని కీలక మార్పులను గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీఎఫ్ చందాదారులు ఇకపై ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేయడం లేదా కొత్త యూఏఎన్‌ను సృష్టించ‌డం సాధ్యం కాదు. ఇకపై ఈ రెండు సేవలను భారత ప్రభుత్వ ఉమాంగ్ యాప్‌కు మార్చారు. వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ (ఎఫ్‌ఏటీ) తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఇటీవల నిర్వహించిన ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, డేటాబేస్ సమీకరణ తర్వాత ఈ మార్పులను అమలు చేసింది. ఈ మార్పులతో ఆన్‌లైన్ సేవలను మరింత వేగవంతంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యమని ఈపీఎఫ్ఓ తెలిపింది.

ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌..

ఇకపై యూఏఎన్ యాక్టివేషన్ సేవలు పూర్తిగా ఉమాంగ్ యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో యూఏఎన్ యాక్టివేషన్ ఆప్షన్‌ను తొలగించారు. కొత్త యూఏఎన్ అవసరమైన ఉద్యోగులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ రెండు సేవలను ఉపయోగించాలంటే ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపును ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్‌ను యాక్టివేట్ చేయాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఈపీఎఫ్ఓ సర్వీసెస్‌లోకి వెళ్లి, యూఏఎన్ సర్వీసెస్ థ్రూ ఫేస్ ఆథ్‌ విభాగంలో ఉన్న యూఏఎన్ యాక్టివేషన్ ను ఎంచుకోవాలి. తర్వాత ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించాలి. కొత్త యూఏఎన్ కావాల్సిన ఉద్యోగులు కూడా ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లి ఈపీఎఫ్ఓ సర్వీసెస్‌ను ఓపెన్ చేసి, యూఏఎన్ అలోట్‌మెంట్ అండ్ యాక్టివేషన్ ను ఎంచుకోవాలి. అనంతరం ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరిస్తే కొత్త యూఏఎన్ జారీ అవుతుంది.

ఖాతా ఉండి కూడా యూఏఎన్ పొంద‌క‌పోతే..

ఇప్పటికే ఈపీఎఫ్ ఖాతా ఉన్నప్పటికీ యూఏఎన్ పొందని ఉద్యోగులు కూడా ఇప్పుడు యూఏఎన్ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించాలి. అనంతరం అవసరమైన మెంబర్ వివరాలను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అన్ని వివరాలు సక్రమంగా ధ్రువీకరించిన‌ తర్వాత కొత్త యూఏఎన్ రూపొందించి, ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేస్తారు. కొత్త వ్యవస్థలో యూఏఎన్‌ను మర్చిపోయిన వినియోగదారులకు కూడా సౌలభ్యం కల్పించారు. వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, అవసరమైన గుర్తింపు లేదా చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. తర్వాత మొబైల్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరిస్తే, విజయవంతమైన వెరిఫికేషన్ అనంతరం తమ యూఏఎన్‌ను తిరిగి పొందవచ్చు. అలాగే మెంబర్ పోర్టల్‌లో యూఏఎన్ యాక్టివేషన్ సేవలను నిలిపివేయడం వల్ల మరణ క్లెయిమ్‌ల పరిష్కారంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అర్హులైన నామినీలు, చట్టబద్ధ వారసులు ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానంలోనే డెత్ క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చని తెలిపింది.

Advertisement
Advertisement