Chandrima Bhattacharya Resigns | మమతా బెనర్జీకి భారీ షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌కి బెంగాల్ చీఫ్ రాజీనామా : రెబెల్స్‌తో భేటీ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మమతా బెనర్జీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజీనామాతో ఊహించని షాక్ తగిలింది.
- టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య తన పదవులన్నింటికీ రాజీనామా
- పార్టీ బ్యాంకు ఖాతాలు, ఎలక్షన్ కమిషన్ సంబంధిత ఆథరైజ్డ్ సిగ్నేటరీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటన
- పదవికి రాజీనామా చేసిన వెంటనే బెంగాల్ అసెంబ్లీలో రెబెల్ (తిరుగుబాటు) వర్గం నేతలతో భేటీ
- కోల్‌కతాలోని తృణమూల్ భవన్ (పార్టీ ఆఫీస్) కోసం మమత వర్గం, రెబెల్స్ మధ్య తీవ్ర ఘర్షణ
Chandrima Bhattacharya Resigns | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి శనివారం మరో భారీ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మమతకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న చంద్రిమా భట్టాచార్య తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సుబ్రతా బక్షి స్థానంలో చంద్రిమా భట్టాచార్యను పార్టీ స్టేట్ ప్రెసిడెంట్‌గా నియమించారు. కానీ ఇప్పుడు ఆమె కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది.
"జూన్ 3న కాళీఘాట్‌లో జరిగిన మీటింగ్‌లో నాకు అప్పగించిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. ప్రస్తుతం నేను నిర్వహిస్తున్న ఇతర పదవుల నుంచి కూడా తప్పుకుంటున్నాను" అని చంద్రిమా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
పార్టీకి సంబంధించిన వివిధ బ్యాంక్ అకౌంట్స్‌కి అథరైజ్డ్ సిగ్నేటరీ (authorised signatory) గా కూడా ఆమె తప్పుకున్నారు. ఎలక్షన్ కమిషన్ (EC) దగ్గర కూడా తాను ఇకపై పార్టీకి ప్రాతినిధ్యం వహించనని ఆమె స్పష్టం చేశారు. అయితే, మమతా బెనర్జీపై తనకు ఎప్పటికీ అత్యున్నత గౌరవం ఉంటుందని లేఖ ముగింపులో పేర్కొనడం గమనార్హం.
రెబెల్స్‌తో భేటీ.. ఆసక్తికర పరిణామం
"నమ్మకం, విశ్వాసం లేని చోట పనిచేయడం సాధ్యం కాదు. అందుకే రాజీనామా చేశాం" అని చంద్రిమా వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖ పంపిన వెంటనే.. బెంగాల్ అసెంబ్లీలో రీతబ్రతా బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ గ్రూప్‌తో (తిరుగుబాటు వర్గం) ఆమె భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మమత ప్రతిపాదించిన సీనియర్ నేతను కాదని, ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న రీతబ్రతా బెనర్జీని ఇటీవల అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించిన విషయం తెలిసిందే.

ఈ రాజీనామాపై మమతా క్యాంప్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తీవ్రంగా స్పందించారు. "మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక శాఖలు అప్పగించినప్పుడు ఆమె ఎందుకు రాజీనామా చేయలేదు?" అని ప్రశ్నించారు. మరోవైపు, బెంగాల్ ప్రజలకు టీఎంసీపై ఆసక్తి పోయిందని.. ఆ పార్టీకి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య విమర్శించారు.
తృణమూల్ ఆఫీస్ కోసం వార్
అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు రెబెల్ గ్రూప్ వైపు వెళ్లిపోగా.. 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు.
ఈ పరిణామాల మధ్య చంద్రిమా రాజీనామాకు ఒక రోజు ముందు.. కోల్‌కతాలోని తృణమూల్ భవన్‌పై పట్టు కోసం మమతా వర్గం, రెబెల్స్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం నాడు రెబెల్స్ పార్టీ ఆఫీస్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని తాళాలు మార్చేశారు. అరూప్ రాయ్‌ను పార్టీ ఛైర్మన్‌గా ప్రకటిస్తూ బోర్డు కూడా పెట్టారు. దీనికి కౌంటర్‌గా మమత విధేయులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తృణమూల్ భవన్ వద్ద భారీగా సీఆర్‌పీఎఫ్ (CRPF), కోల్‌కతా పోలీసులు మోహరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mamata Banerjee | సువేందు చేతిలో ఓటమి.. భవానీపూర్ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
జూన్ 16, 2026

Kalyan Banerjee | అభిషేక్ నాకు కొడుకు లాంటివాడు.. క్షమించడం తండ్రిగా నా బాధ్యత.. కళ్యాణ్ బెనర్జీ యూటర్న్
జూన్ 13, 2026

Abhishek Banerjeee | అభిషేక్ బెనర్జీ నివాసంలో ఆకస్మిక సోదాలు.. భారీగా మోహరించిన పోలీసులు
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●Raju Kumar Singh | వైద్యురాలి మృతి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకి నాలుగేళ్లు జైలు శిక్ష
- ●SIP | నెలకు రూ.500తోనే కోటీశ్వరులు కావచ్చా? ఇలా చేస్తే భారీ సంపద!
- ●Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్
- ●Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
- ●Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? - నయనతారను బీట్ చేసిందిగా!
- ●Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!

Raju Kumar Singh | వైద్యురాలి మృతి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకి నాలుగేళ్లు జైలు శిక్ష

SIP | నెలకు రూ.500తోనే కోటీశ్వరులు కావచ్చా? ఇలా చేస్తే భారీ సంపద!

Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!



