Mahesh Kumar Goud | రాముడికి బీజేపీ పార్టీలో సభ్యత్వం ఉందా?
Mahesh Kumar Goud | రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకుని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీజేపీ పార్టీలో రాముడికి సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ వంటిదని అభివర్ణించారు.
- దమ్ముంటే అభివృద్ధి పేరు చెప్పి ఓట్లడగండి
- మనువాద రాజ్యాంగ అమలుకు కుట్రలు జరుగుతున్నయ్
- గాంధీ, నెహ్రూ లెగసిని మరిపించే ప్రయత్నం చేస్తున్నరు
- నేషనల్ లీగల్ కాన్‌క్లేవ్ 2026 సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకుని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీజేపీ పార్టీలో రాముడికి సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లీగల్ కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ వేదికగా ‘నేషనల్ లీగట్ కన్‌క్లేవ్ 2026’ నిర్వహించడం అభినందనీయన్నారు. భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ వంటిదని అభివర్ణించారు.
ఓట్లను తొలగించే పని జరుగుతుంది..
రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని కుట్రకు తెరలేపారు. గాంధీ, నెహ్రూ లెగసిని మరిపించే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ ఫ్యామిలీ త్యాగాలకు మారుపేరు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు చోరీ చేశారు. అభివృద్ధి పేరు చెప్పి బీజేపీ నేతలకు ఓట్లు అడిగే దమ్ముందా? సర్ కార్యక్రమం ఓట్లను జత చేసే కార్యక్రమం. ఇప్పుడు ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. బీహార్, వెస్ట్ బెంగాల్‌లో ఏం జరిగిందో చూశాం.
బెంగాల్‌లో 90 లక్షలకుపైగా ఓట్లు తొలగించి 30 లక్షల వరకు మాత్రమే ఓట్లు నమోదు చేశారు. మోదీ భ్రమలు వీడాలీ. గొప్ప గొప్ప మహారాజులు కాల గర్భంలో కలిసిపోయారు. అధికారమే పరమవాదిగా మోదీ, అమిత్ షా తీరు ఉంది. పేపర్ లీకులతో కేంద్రం విద్యార్థులతో చెలగాటం ఆడుతోంది అని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.
కుల సర్వేలో తెలంగాణ రోల్ మోడల్..
భారత్ జోడో యాత్ర నుంచి ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ నినాదం స్ఫూర్తితో 100 సంవత్సరాల తర్వాత కుల సర్వే నిర్వహించాం. కుల సర్వేతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. రాహుల్ గాంధీ మిషన్‌లో చేరి అప్రజాస్వామిక పాలనపై పోరాడాలి అని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం





