Rashmika Mandanna | నేషనల్ క్రష్ డబుల్ ధమాకా – నెల గ్యాప్‌లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్
రష్మిక మందన్న మైసా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుందని అంటున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. మైసా కంటే ముందు సెప్టెంబర్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న రణబాలి థియేటర్లలో సందడి చేయబోతుంది.
Entertainment | Published On Jul 4, 2026, 4.31 pm IST
Rashmika Mandanna | నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగులో రణబాలితో పాటు మైసా సినిమాలు చేస్తోంది రష్మిక. రణబాలిలో భర్తతో విజయ్ దేవరకొండకు జోడీగా కనిపించబోతుంది. మైసా లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతోంది. ది గ్లర్‌ఫ్రెండ్ తర్వాత తెలుగులో రష్మిక చేస్తోన్న సెకండ్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఇది.
యాక్షన్ రోల్...
రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో యాక్షన్ రోల్‌లో రష్మిక కనిపించబోతుంది. మైసా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇటీవలే కేరళలో పదహారు రోజుల పాటు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ఆగస్ట్‌లోగా షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు సమాచారం.
అక్టోబర్‌లో...
కాగా మైసా మూవీ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆక్టోబర్ 16న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.
గోండు జాతి యువతిగా...
మైసాలో రష్మిక గోండు జాతి యువతిగా కనిపించబోతుంది. తన కుటుంబంతో పాటు జాతికి జరిగిన అన్యాయంపై ఓ యువతి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగనుందట.ఇందులో రష్మికపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోతాయని టాక్ వినిపిస్తోంది. మైసాలో గురుసోమసుందరం, రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
నెల గ్యాప్‌లో...
కాగా నెల రోజుల గ్యాప్‌లో రష్మిక మందన్న రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మైసా కంటే ముందు సెప్టెంబర్‌లో రణబాలి రిలీజ్ కాబోతుంది. హిస్టారికల్ యాక్షన్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది రష్మిక . రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ లో రణబాలి...అక్టోబర్ లో మైసా...బ్యాక్ టూ బ్యాక్ రష్మిక మందన్న రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
కాక్ టెయిల్ 2...
రష్మిక హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మికతో పాటు కృతి సనన్ మరో హీరోయిన్‌గా నటించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Chandrima Bhattacharya Resigns | మమతా బెనర్జీకి భారీ షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌కి బెంగాల్ చీఫ్ రాజీనామా : రెబెల్స్‌తో భేటీ!
- ●Airtel | రూ.349 ప్లాన్‌కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..
- ●PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
- ●EPFO | యూఏఎన్ సేవల్లో భారీ మార్పు.. ఇక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కాదు, ఉమాంగ్ యాప్‌లోనే..
- ●PFA | పల్స్ ఫీల్డ్ అబ్లేషన్‌తో గుండె దడకు చెక్.. 31, 84 ఏండ్ల బాధిత వ్యక్తులకు చికిత్స విజయవంతం
- ●Alluri Birth Anniversary | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Chandrima Bhattacharya Resigns | మమతా బెనర్జీకి భారీ షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌కి బెంగాల్ చీఫ్ రాజీనామా : రెబెల్స్‌తో భేటీ!

Airtel | రూ.349 ప్లాన్‌కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ

EPFO | యూఏఎన్ సేవల్లో భారీ మార్పు.. ఇక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కాదు, ఉమాంగ్ యాప్‌లోనే..






