త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | రూ.349 ప్లాన్‌కే అన్‌లిమిటెడ్ 5జీ.. ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ ఊరట..

Airtel | దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులకు భార‌తి ఎయిర్‌టెల్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్‌లకే 5జీ సేవలు అందిస్తామని ప్రకటించిన సంస్థ, ఇప్పుడు తక్కువ ధర ప్లాన్‌లో కూడా 5జీ డేటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రోజుకు 1.5జీబీ డేటా ఉపయోగించే వినియోగదారులకు కూడా ప్రయోజనం కలగనుంది.

S

Business | Published On Jul 4, 2026, 5.04 pm IST

Airtel | రూ.349 ప్లాన్‌కే అన్‌లిమిటెడ్ 5జీ.. ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ ఊరట..
Advertisement

Airtel | దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులకు భార‌తి ఎయిర్‌టెల్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్‌లకే 5జీ సేవలు అందిస్తామని ప్రకటించిన సంస్థ, ఇప్పుడు తక్కువ ధర ప్లాన్‌లో కూడా 5జీ డేటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రోజుకు 1.5జీబీ డేటా ఉపయోగించే వినియోగదారులకు కూడా ప్రయోజనం కలగనుంది. ఇటీవల వరకు ఎయిర్‌టెల్‌తోపాటు రిల‌య‌న్స్ జియో కూడా రోజుకు 2జీబీ డేటా లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రీచార్జ్ ప్లాన్‌లకే 5జీ సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ తన విధానంలో మార్పులు చేసి, రోజుకు 1.5జీబీ డేటా ఉన్న ప్లాన్‌కూ 5జీ సదుపాయాన్ని చేర్చింది. ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్ కాదు. చాలా కాలంగా సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈ ప్లాన్‌లో ఇప్పుడు 5జీ డేటా ప్రయోజనాన్ని కూడా చేర్చింది.

300 జీబీ వ‌ర‌కు ప‌రిమితి..

రూ.349 ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. వీటితోపాటు ఇప్పుడు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా అందిస్తోంది. అయితే ఇది పూర్తిగా పరిమితులు లేనిది కాదు. ప్రతి 30 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 300జీబీ వరకు మాత్రమే 5జీ డేటాను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. రీచార్జ్ చేసుకోవాలనుకునే వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ లేదా ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏడాది పాటు సుమారు రూ.4వేల విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే యాపిల్ మ్యూజిక్ గ్లోబల్ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. అదనంగా ఫ్రీ హెల్లోట్యూన్స్ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందుబాటులో ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement